Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ లో ఎక్కువగా వెతికిన న్యూస్ ఏదంటే !

By:  Tupaki Desk   |   15 April 2020 5:00 AM IST
లాక్ డౌన్ లో ఎక్కువగా వెతికిన న్యూస్ ఏదంటే !
X
దేశంలో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా కట్టుదిట్టంగా అమలవుతోంది. ప్రజలంతా తమ వంతు బాధ్యతగా ఇంటిపట్టునే ఉంటూ కరోనాపై యుద్ధంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఇక తాజాగా తొలిదశ లాక్ డౌన్ గడువు ముగియడం తో ..కరోనా కట్టడిలోకి రాని కారణంగా ..మే 3 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు.

ఇకపోతే , లాక్ డౌన్ సమయంలో ప్రజలందరూ ఇంట్లో ఉంటూ ఇంటర్నెట్ లో పలు విషయాలను శోధిస్తూ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో భారతీయులు అత్యధికంగా వెతికిన 10 అంశాలను గూగుల్ ప్రకటించింది. అవేంటో చూద్దాం.

కరోనా వైరస్ టిప్స్
కరోనా వైరస్
లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్
కోవిడ్-19
హైడ్రాక్సీ క్లోరోక్విన్
కరోనా వైరస్ సింప్టమ్స్
ఆరోగ్యసేతు యాప్
లాక్ డౌన్
ఆరోగ్య సేతు
కరోనా వైరస్ ప్రివెన్షన్