Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి అసెంబ్లీ డిజైన్ల‌లో టాప్ త్రీలో నిలిచిన‌వి ఇవే

By:  Tupaki Desk   |   23 Oct 2017 5:57 AM GMT
అమ‌రావ‌తి అసెంబ్లీ డిజైన్ల‌లో టాప్ త్రీలో నిలిచిన‌వి ఇవే
X
ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించ‌నున్న అసెంబ్లీ భ‌వ‌నానికి సంబంధించిన న‌మూనాల్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వైనం తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల అభిప్రాయాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న తీరుపై వ‌స్తున్న స్పంద‌న‌ల స‌మాచారం తాజాగా వెల్ల‌డైంది. అసెంబ్లీ భ‌వ‌నాన్ని ఏ తీరులో నిర్మించాల‌న్న అంశంపై రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సోష‌ల్ మీడియాలో అభిప్రాయ సేక‌ర‌ణ‌ను చేప‌ట్టింది.

ఆదివారం సాయంత్రం వ‌ర‌కూ అసెంబ్లీ న‌మూనాల‌పై త‌మ అభిప్రాయాన్ని చెప్పేందుకు 5927 మంది రియాక్ట్ అయ్యారు. వీరిలో అత్య‌ధికులు పొడ‌వైన ట‌వ‌ర్ తో రూపొందించిన ఆకృతికి ఓటు వేయ‌గా.. రెండో బెస్ట్ ఆప్ష‌న్‌ గా ఆప్ష‌న్ 6గా పేర్కొన్న మోడ‌ల్‌ కు ఓటేశారు. ఇక‌.. ఆప్ష‌న్ రెండుగా పేర్కొన్న మోడ‌ల్‌ కు మూడో స్థానం ల‌భించింది.

ఆప్ష‌న్ 1గా ఇచ్చిన మోడ‌ల్‌ కు అనుకూలంగా అత్య‌ధికులు 2617 మంది ఓటేయ‌టం విశేషం. సీఆర్డీ త‌మ వెబ్ సైట్ తో పాటు.. గూగుల్‌.. ఫేస్ బుక్ ద్వారా ప్ర‌జాభిప్రాయాన్ని సేక‌రిస్తోంది. ఇందులో భాగంగా సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల అభిరుచిని చూస్తే.. ట‌వ‌ర్ మోడ‌ల్‌కు ఎక్కువ మంది ఓటు వేసిన‌ట్లుగా తేలింది.

సోష‌ల్ మీడియాలో ప్ర‌జాభిప్రాయం కోసం పెట్టిన మోడ‌ళ్ల‌ను లండ‌న్‌ కు చెందిన నార్మ‌న్ ఫోస్ట‌ర్ అండ్ పార్ట్‌ న‌ర్స్ సంస్థ రూపొందించిన విష‌యం తెలిసిందే. ఈ సంస్థ సిద్ధం చేసిన అకృతుల ప‌ట్ల ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌క్కువ ప్ర‌ద‌ర్శించ‌లేదు. డిజైన్లు సంతృప్తిక‌రంగా లేవ‌ని ఆయ‌న చెప్ప‌టం తెలిసిందే.

కొన్ని మార్పులు చేర్పులు సూచించ‌టంతో పాటు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సూచ‌న‌ల్ని కోరటం తెలిసిందే. ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు.. ఈ నెల 24..25 తేదీల్లో నార్మ‌న్ ఫాస్ట‌ర్ ప్ర‌తినిధుల్ని లండ‌న్ లో స‌మావేశం కానున్నారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ.. హైకోర్టు భ‌వ‌నాల‌కు సంబంధించిన తుది డిజైన్ల‌ను తేల్చేయ‌నున్నారు. తాను నార్మ‌న్ ప్ర‌తినిధుల్ని క‌లిసే లోపు.. సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జాభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాల‌ని భావించారు. ఇందులో ట‌వ‌ర్ మోడ‌ల్‌ కు మొద‌టి స్థానం ల‌భించింది. మ‌రి.. సీఎం చంద్ర‌బాబు ఏ మోడ‌ల్‌ ను సిద్ధం చేస్తారో చూడాలి.