Begin typing your search above and press return to search.

ప్రపంచంలో టాప్ త్రీ ధనిక కుటుంబాలు ఇవే..

By:  Tupaki Desk   |   27 Nov 2021 8:30 AM GMT
ప్రపంచంలో టాప్ త్రీ ధనిక కుటుంబాలు ఇవే..
X
ప్రపంచంలోని కొందరు వ్యాపారవేత్తలు మిగతా వారికంటే అత్యధికంగా డబ్బు సంపాదిస్తూ ధనికులుగా మారుతారు. అలా వారి సంపద పెరిగి నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతారు. ప్రస్తుతం ప్రపంచంలోని కుబేరుల్లో ఎవరంటే ఎలెన్ మస్క్, జెఫ్ బోజోస్ పేర్లు చెబతాం.

అలాగే ఇండియా విషయానికొచ్చేసరికి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ పేర్లు ప్రస్తావిస్తారు. అయితే కొందరు కేవలం ఒక్క సంవత్సరంలోనే కాకుండా తరతరాలుగా ధనవంతులుగా కొనసాగుతున్నారు. వీరి టాప్ టెన్ లో ఉంటూ వారి సంపదను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నారు. అలాంటి వారు తమ వ్యాపారాలను రోజురోజుకు విస్తరించుకుంటూ పోతూ దినదినాభివృద్ధి చెందుతారు. ఎప్పటికీ ధనవంతులుగానే కొనసాగుతున్న ఆ బిలియనీర్లు ఎవరో చూద్దాం..

ఒక దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించినవారు ఇతర దేశాల్లో విస్తరించుకుంటూ పోతారు. లాభనష్టాలను అంచనా వేసుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటారు. అయితే నష్టం ఆయా దేశాల పరిస్థితులను భట్టి తమ వ్యాపారాలు కొన్ని చోట్ల నష్టం వాటిల్లినా మిగతా ప్రాంతాల్లో వచ్చిన లాభాలతో కంపేర్ చేస్తారు.

ఎటోచ్చి బిజినెస్ ను సక్సెస్ ఫుల్ గా రన్నవడానికే ట్రై చేస్తారు. భారత్ కు చెందిన ధీరుభాయి అంబానీ కోట్ల సంపాదనను కూడబెట్టి ఆ తరువాత వారి కూమారులకు పంచారు. వారిలో ముఖేష్ అంబానీ ఆ సంపదను మరింత అభివృద్ధి చేస్తూ దేశంలోనే టాప్ ప్లేసులో ఉంటున్నారు.

ఫ్రెడ్ ఖోక్ అనే వ్యాపారి పెట్రో ఉత్పత్తి వ్యాపారంలో ప్రముఖుడు. ఆయన చిన్న వ్యాపారంగా ప్రారంభించి పెద్ద ఎత్తున సంపాదించాడు. ప్రస్తుతం ఖోక్ కుటుంబం సంపద విలువ 124 బిలియన్ డాలర్లు. ఫ్రెడ్ ఖోక్ చమురు వ్యాపారమే కాకుండా ఇతర రంగాల్లో విస్తరించారు. ఫ్రెడ్ ఖోక్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని తన నలుగురు కుమారులకు పంచారు. వారిలో ఇద్దరు వ్యాపారం నుంచి తప్పుకోవడంతో మిగతా ఇద్దరు దీనిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చార్ల్స్ ఖోక్ కంపెనీ బోర్డు చైర్మన్ గా ఉన్నారు.

అమెరికాలో పుట్టిన వాల్ మార్ట్ ఇండియాలో పాపులర్ అయింది. చైన్ మార్కెట్లో విస్తృతంగా అభివృద్ధి చెందిన దీనిని సామమ్ వాల్టన్ స్థాపించారు. ఆయన మొదలుపెట్టిన ఈ వ్యాపారం ప్రస్తుతం ఐదోతరం వారసులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి దీని నిర్వాహకులు టాప్ టెన్లో ఉంటున్నారు.

ప్రస్తుతం వాల్టన్ కుటుంబం సంపద విలువ 205 బిలియన్ డాలర్లు. ఈ ప్రముఖ రిటైల్ దిగ్గజం భారత్ లోని మెజార్టీ వాటాను దక్కించుకుంది. అలాగే 2027 నాటికి ప్రతి సంవత్సరం భారత్ నుంచి వస్తువుల ఎగుమతులను మూడు రేట్లు పెంచుతామని ప్రకటించింది. దీంతో చిన్న, సూక్ష్మ తరహా సంస్థలకు వాల్ మార్ట్ నిర్ణయం ప్రోత్సహకరంగా ఉంటుందని భావించారు.

చిన్ని పిల్లలు తినే చాక్లెట్లను ఫ్రాంక్ మార్స్.. తన పేరుమీదనే కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ చాక్లెట్లనే కాకుండా స్నీక్కర్స్, ఎమ్ అండ్ ఎమ్ డోవ్ వంటి చాక్లెట్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. అయితే పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తుల ద్వారానే మార్స్ కంపెనీకి అధిక ఆదాయం వస్తుంది.

వాటి వాల్యూ 141 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్స్ కంపెనీలను ప్రస్తుతం ఆయన ఐదోతరం వారసులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతీ సంవత్సరం కుభేరుల జాబితా మారుతున్నా తరతరాలుగా వీరి వద్ద సంపద మాత్రం తరగడం లేదు. దాదాపు ఐదు తరాలుగా ఈ కుటుంబాలు తమ సంపదను రోజురోజుకు పెంచుకుంటూ వస్తున్నాయి. ఇండియాలో అంబానీ ఫ్యామిలీ టాప్ ప్లేసులో ఉంటుంది. దీరుబాయి అంబానీ సృష్టించిన సంపదను ఆయన వారసులు పెంచుకుంటూ పోతున్నారు.