Begin typing your search above and press return to search.
కరోనా ప్యానెల్ కి టాప్ వైరాలజిస్ట్ రాజీనామా .. కేంద్రంపై విమర్శలు !
By: Tupaki Desk | 17 May 2021 7:30 AM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. లక్షల్లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు , వేలల్లో కరోనా మహమ్మారి మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగైదు రోజులుగా ప్రతి రోజు నమోదు అయ్యే కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నప్పటికీ కూడా , మరణాల్లో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు కూడా దాదాపుగా నాలుగు వేలకి పైగా కరోనా మహమ్మారి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ , కర్ఫ్యూ ను అమలు చేస్తున్నాయి. ఈ తరుణంలో మోడీ సర్కార్ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ శాస్త్రీయ సలహా బృందం నుంచి అనూహ్యంగా సీనియర్ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ తప్పుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి విషయంలో అధికార యంత్రాంగం తీరును జమీల్ తప్పుబట్టిన కొద్ది రోజుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కరోనా వైరస్ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ద ఇండియన్ సార్స్-సీఓవీ-2 జీనోమిక్ కన్సార్టియం ఛైర్మన్ షహీద్ జమీల్. ఈ అడ్వైజరీ గ్రూప్ గత ఏడాది డిసెంబర్ లో ఏర్పాటు అయ్యింది. కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వం వహిస్తోన్న ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో ఈ గ్రూప్ పని చేస్తోంది. తాను మంచి నిర్ణయమే తీసుకున్నా.. దీనిపై ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోవడం లేదు’’ అని డాక్టర్ షాహీద్ వ్యాఖ్యానించారు. ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ కన్సార్టియం లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రాజీనామాపై ఎటువంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు అని రాయిటర్స్ కు సమాధానం ఇచ్చారు. బ్రిటన్ లో పుట్టుకొచ్చిన కరోనా కొత్తరకం వేరియంట్ బీ117 గురించి మొట్టమొదటి సారిగా కేంద్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది ఈ అడ్వైజరీ గ్రూపే.
ఈ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ పదవి నుంచి షహీద్ జమీల్ అర్ధాంతరంగా తప్పుకోవడం కలకలం రేపుతోంది. కరోనాను కట్టడి చేయడానికి తాము చేసిన సూచనలు, సిఫారసుల పట్ల కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదని, కీలకమైన విషయాల్లో మొండిపట్టుదలకు పోతోందంటూ న్యూయార్క్ టైమ్స్ లో ఆయన ఓ కాలమ్ రాశారు. కరోనా నివారణకు అవసరమైన విధానాలను రూపొందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. దేశంలో కోవిడ్ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం, వ్యాక్సిన్ కొరత, దేశీయ ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉందంటూ ఆయన ఆ కాలమ్ లో రాసుకొచ్చారు. ఈ చర్యలన్నింటికీ భారతదేశంలోని నా తోటి శాస్త్రవేత్తలలో విస్తృత మద్దతు ఉంది. కానీ వారు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి పట్టుదలను ఎదుర్కొంటున్నారుని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్రధాన మంత్రికి ఏప్రిల్ 30న 800 మంది భారతీయ శాస్త్రవేత్తలు విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. భారత్‌లో మహమ్మారి నియంత్రణలో లేనందున డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మరో ప్రమాదమే. చెల్లించుకుంటున్న మూల్యం శాశ్వత మచ్చగా మిగిలిపోతుందని అన్నారు.