Begin typing your search above and press return to search.

సునీతమ్మ పని కూడా పడతాం..ఎమ్మెల్యే సవాల్

By:  Tupaki Desk   |   24 Feb 2020 4:30 PM GMT
సునీతమ్మ పని కూడా పడతాం..ఎమ్మెల్యే సవాల్
X
గత ప్రభుత్వంపై చేసిన పరిపాలనను పరిశీలించాలని చెబుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అప్పటి మంత్రులుగా ఉన్న వారిలో కలవరం మొదలైంది. అయితే గత ప్రభుత్వంలో చేసిన పనులను పరిశీలించేందుకు ఏర్పాటుచేసిన సిట్ త్వరలోనే కార్యాచరణ మొదలుపెట్టే అవకాశం ఉంది. అయితే గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత వ్యవహారం కూడా త్వరలోనే తేలనుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. త్వరలోనే ఆమె బండారం బయటపడతామని హెచ్చరించారు.

ప‌రిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై కూడా ప్ర‌భుత్వం దృష్టి పెట్టింద‌ని రాప్తాడు వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హ‌యాంలో చోటుచేసుకున్న అవినీతి వ్య‌వ‌హారాలు వెలుగులోకి వ‌స్తుండ‌డంతో పాటు ప‌రిటాల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన అవినీతి వ్య‌వ‌హారాలు కూడా త్వరలో వెలుగులోకి వస్తాయని చెప్పారు. కాంట్రాక్ట్ వ్య‌వ‌హారాలు, సివిల్ సప్లైస్ శాఖ‌కు సంబంధించిన అవినీతి వ్య‌వ‌హారాల‌ను బ‌య‌ట‌పెడ‌తామ‌ని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో ప‌రిటాల సునీత పౌర‌ స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించడంతో ఆ శాఖలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. సివిల్ స‌ప్లైస్ లో అవినీతికి చాలా ఆస్కారం ఉంద‌ని, ఆ క్రమంలోనే ఆ శాఖలో భారీ అవినీతి జరిగి ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అప్ప‌ట్లో చంద్ర‌న్న కానుక‌లు అంటూ కోట్ల రూపాయ‌లు వెనకేసుకుని ఉన్నారని ఆరోపించారు. పండ‌గ వ‌చ్చిందంటే.. వారే పండుగ చేసుకున్నార‌నే ఆరోప‌ణ‌లు వఉన్నాయని, మ‌గ్గిపోయిన ప‌ప్పుబెల్లాల‌ను ప్ర‌జ‌ల‌కు పంచిపెట్టడం, అన్నా క్యాంటీన్ల వ్య‌వ‌హారం తదితర విషయాల్లో సునీతమ్మ వ్యవహారం తేలుతుందని పేర్కొన్నారు.

ప‌రిటాల సునీత సోద‌రులు, వారి అనుచరులు నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో కోట్ల రూపాయ‌ల విలువైన కాంట్రాక్టుల‌ను పొందార‌ని, అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించి కోట్ల రూపాయ‌ల‌ను దోచార‌ని ప్ర‌కాశ్ రెడ్డి ఆరోపించారు. అన్నింటినీ బ‌య‌ట పెట్టే స‌మ‌యం వ‌చ్చింద‌ని, ప‌రిటాల అవినీతిని మొత్తం బ‌య‌ట‌పెడ‌తామ‌ని తెలిపారు. కియా భూముల వ్య‌వ‌హారం కూడా ప్ర‌స్తావించి సునీతమ్మ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలోనే అవి కూడా బహిర్గతం అవుతాయని పేర్కొన్నారు.