Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ పార్టీకి గుర్తు వ‌చ్చేసిందోచ్!

By:  Tupaki Desk   |   10 March 2019 7:10 AM GMT
క‌మ‌ల్ పార్టీకి గుర్తు వ‌చ్చేసిందోచ్!
X
విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న సొంతంగా పమ‌క్క‌ల్ నీది మ‌య్యం పేరుతో పార్టీ పెట్టారు. రాజ‌కీయాల్లో మార్పును ఆశిస్తున్న ఆయ‌న‌.. త‌మిళ ప్ర‌జ‌ల‌కు త‌న క‌ల‌ల్ని నిజం చేస్తార‌ని భావిస్తున్నారు. ఇప్పుడున్న రాజ‌కీయాల‌కు భిన్న‌మైన రాజ‌కీయాన్ని ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయాల‌న్న ఆలోచ‌న‌తో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ మ‌రికొద్ది గంట‌ల్లో వెలువ‌డుతున్న వేళ‌.. దేశం మొత్తం ఎన్నిక‌ల ఫీవ‌ర్ ప‌ట్టేసింది. క‌మ‌ల్ పార్టీకి తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తును కేటాయించింది. టార్చ్ లైట్ ను పార్టీ గుర్తుగా ఎంపిక చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌మ‌కు టార్చ్ లైట్ ను పార్టీ గుర్తుగా కేటాయించినందుకు ఈసీకి ధ‌న్య‌వాదాల్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా క‌మ‌ల్ వెల్ల‌డించారు.

త‌మ పార్టీకి త‌గిన గుర్తే ల‌భించిన‌ట్లు ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మిళ రాజ‌కీయాల్లోనూ.. ఆ మాట‌కు వ‌స్తే భార‌త రాజ‌కీయాల్లోనూ మ‌క్క‌ల్ నీది మ‌య్యం టార్చ్ బేర‌ర్ గా మార‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న పార్టీని ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌.. తాజాగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. అన్ని స్థానాల్లో తాము ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

స్వ‌చ్ఛ‌మైన చేతుల‌తో ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించేందుకు కృషి చేస్తామ‌ని చెప్పిన ఆయ‌న‌.. అవినీతి పార్టీల‌తో ఎట్టి ప‌రిస్థితుల్లో తాము చేతులు క‌ల‌ప‌మ‌ని చెబుతున్నారు. డీఎంకేతో తెగ‌తెంపులు చేసుకుంటే తాము కాంగ్రెస్ తో చేతులు క‌లుపుతాన‌ని క‌మ‌ల్ అంటున్నారు. క‌మ‌ల్ ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి మ‌చ్చ అన్న‌ది లేకుండా ఉంద‌నా? నీతులు చెబుతూ.. ఆద‌ర్శాలు వ‌ల్లించే వేళ‌.. సంప్ర‌దాయ రాజ‌కీయ పార్టీల‌తో సంబంధాలు పెట్టుకోకుండా సొంతంగా త‌మ స‌త్తా చాటాల్సిన అవ‌స‌రం ఉంది. అంతేకానీ.. ఆద‌ర్శాలు ఆకాశంలో పెట్టుకొని అందుకు భిన్నంగా రోటీన్ రాజ‌కీయ పార్టీల‌తో చెట్టాప‌ట్టాలేసుకొని తిర‌గ‌టంలో అర్థం లేదు.