Begin typing your search above and press return to search.

టోర్నడో : మంజీరా నదిలో అద్భుత దృశ్యం.. వైరల్

By:  Tupaki Desk   |   6 Sep 2022 2:30 AM GMT
టోర్నడో : మంజీరా నదిలో అద్భుత దృశ్యం.. వైరల్
X
నిలువెత్తు సుడిగాలి.. ఆ గాలిలో పెద్ద పెద్ద వస్తువులు సైతం చీపులు పుల్లల్లా కొట్టుకుపోవడం... దీంతో జన, ఆస్తి నష్టం జరిగే టోర్నటో అమెరికాను వణికిస్తుంటుంది. అప్పట్లో యూఎస్‌ఏ లోని కెంటకీలో టోర్నడో దాడి తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉవ్వెతున్న చుట్టుకొచ్చిన సుడిగాలికి 100 మంది మృతి చెందారు. పలు ఆస్థులు తీవ్రంగా ధ్వంసమయ్యారు. దీని ధాటికి పలు నివాసాలు కొట్టుకుపోయాయి.

టోర్నడో అంటే మనకు తెలియకపోవచ్చు కానీ.. అమెరికన్లు దీనికి బాధితులే. మనం ఇక్కడ దీన్ని సుడిగాలి అంటాం.. మన దగ్గర చిన్నగా వచ్చే ఇవీ.. అమెరికాలో మాత్రం అతి భీకరంగా విరుచుకుపడుతాయి. టోర్నడో ధాటికి ఇల్లు, కార్లు, వ్కక్తులు కూడా కొట్టుకుపోయి చనిపోతారు.

టోర్నడోలు కి.మీల దూరంలో బీభత్సం సృష్టించాయి. గాలికి విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, ఎలక్ట్రికల్ పోల్స్ కొట్టుకుపోయాయి. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని కార్లలో బయటకు వెళ్లొద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంటుంది.

సేమ్ అచ్చం అలాగే తాజాగా మంజీరా నదిపై ఓ టోర్నడో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్న వేళ అనూహ్యంగా మంజీరా నదిలో సుడిగాలి చెలరేగింది. గింగిరాలు తిరుగుతూ ఆకాశం నుంచి నదిలోకి తెల్లని ధారలా ఏర్పడింది. సుమారు రెండు నిమిషాల సేపు నీరు నింగివైపు ఎగిసింది. అటుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా తిలకించారు.

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నిర్జప్ల గ్రామ శివారులోని మంజూరా నదిలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

ఈ టోర్నడో వల్ల అమెరికాతో పోలిస్తే తెలంగాణలో ఎలాంటి నష్టం సంభవించలేదు. ఆకాశంలో కాసేపు అద్భుత దృశ్యం ఆవిష్కరమైంది. దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సుడిగుండంలా తిరిగి మాయమైంది. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.