Begin typing your search above and press return to search.

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 100మంది మృతి

By:  Tupaki Desk   |   11 Dec 2021 1:32 PM GMT
అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 100మంది మృతి
X
నిలువెత్తు సుడిగాలి.. ఆ గాలిలో పెద్ద పెద్ద వస్తువులు సైతం చీపులు పుల్లల్లా కొట్టుకుపోవడం... దీంతో జన, ఆస్తి నష్టం జరిగే టోర్నటో ఇప్పుడు అమెరికాను వణికిస్తోంది. యూఎస్‌ఏ లోని కెంటకీలో టోర్నడో దాడి తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉవ్వెతున్న చుట్టుకొచ్చిన సుడిగాలికి 100 మంది మృతి చెందారు. పలు ఆస్థులు తీవ్రంగా ధ్వంసమయ్యారు. దీని ధాటికి పలు నివాసాలు కొట్టుకుపోయాయి.

అమెరికాలో టోర్నడోలు (సుడిగాలులు) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని కెంటుకీలో టోర్నడో ధాటికి దాదాపు 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

టోర్నడోలు కి.మీల దూరంలో బీభత్సం సృష్టించాయి. గాలికి విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, ఎలక్ట్రికల్ పోల్స్ కొట్టుకుపోయాయి. ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని కార్లలో బయటకు వెళ్లొద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

కెంటుకీలో అత్యవసర పరిస్థితిని గవర్నర్ విధించారు. కెంటుకీలోని పలు కౌంటీలు టోర్నడో ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. ఈ గాలుల ధాటికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతోపాటు సమీప ప్రాంతాల్లోని భవనాలు సైతం ధ్వంసమయ్యాయి.

మేఫీల్డ్ లోని ఓ కొవ్వొత్తుల ఫ్యాక్టరీపై పైకప్పు కూలిపోవడంతో భారీ సంఖ్యలో క్షతగాత్రులయ్యారని గవర్నర్ తెలిపారు. ఇల్లినాయస్ లోని అమెజాన్ గిడ్డంగిలో 100 మంది సిబ్బంది చిక్కుకున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఈ టోర్నడోలు ప్రభావంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

టోర్నడోలు ఎక్కువగా అమెరికాలో సంభవిస్తాయి. ఈ టోర్నడోలను తీవ్రతను బట్టి మూడు రకాలుగా విభజించారు. టోర్నడోలు అంటే బలమైన సుడిగాలులు అని అర్థం. ఉరుములకు అనుసంధానంగా ఏర్పడే ఈ సుడిగాలులు గంటకు ఏకంగా 300 మైళ్ల వేగంతో కూడా ప్రయాణిస్తాయి. దీంతో ఈ గాలుల ధాటికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతోపాటు సమీప ప్రాంతాల్లోని భవనాలు ధ్వంసమవుతాయి.