Begin typing your search above and press return to search.

కొవ్వాడ విద్యుత్ ప్లాంట్ లో ఊహించ‌ని ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   9 Feb 2017 5:59 AM GMT
కొవ్వాడ విద్యుత్ ప్లాంట్ లో ఊహించ‌ని ట్విస్ట్‌
X
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం...ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఈ న్యూక్లియ‌ర్ ప్లాంట్ విష‌యం హాట్ టాపిక్‌. ప్ర‌పంచం - దేశ‌వ్యాప్తంగా అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటును వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టు విష‌యంలో ముందుకు సాగుతోంది. చాప‌కింద నీరులా సాగుతున్న ఈ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా ఆందోళ‌నలు కొన‌సాగుతున్నాయి. అయితే ఇపుడు ఊహించ‌ని ట్విస్ట్ ఎదురైంది. ఏకంగా కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం నిర్మాణం అయోమయంలో పడింది. అణువిద్యుత్‌ కేంద్రాల నిర్మాణ వ్యవహారాల నుండి వైదొలగాలని జపాన్‌ కు చెందిన తోషిబా కార్పొరేషన్‌ ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్ర ప్రధాన కాంట్రాక్టు సంస్థ వెస్టింగ్‌ హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ డైలమాలో పడింది. భారత్‌-అమెరికా మధ్య కుదిరిన అణు సహకార ఒప్పందంలో భాగంగా ఈ అణు విద్యుత్‌ కేంద్రానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వా డలో భూమి కేటాయించిన విషయం తెలిసిందే.

తోషిబా సంస్థ వైదొలగిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై అమెరికన్‌ భాగస్వామి నుండి సమాచారం కోసం తాము ఎదురు చూస్తున్నట్లు భారత అణువిద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఎన్‌ పిసిఐఎల్‌) అధికారులు చెబుతున్నారు. ఈ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన వాణిజ్య కాంట్రాక్ట్‌ లో భాగంగా కొవ్వాడలో మూడు జతల అణు రియాక్టర్లను ఏర్పాటు చేయటం ద్వారా ఈ రెండు సంస్థలూ ఈ ఏడాది చివరి నాటికి ఒప్పందాన్ని పూర్తి చేయాల్సి వుంది. కొవ్వాడ ప్రాజెక్టుకు ఎదురవుతున్న సవాళ్లకు సంబంధించి వెస్టింగ్‌ హౌస్‌ నుండి తమకు ఎటు వంటి సమాచారమూ అందలేదని భారత్‌ పేర్కొంది. తోషిబా సంస్థ తీసుకున్న నిర్ణయంపై వెస్టింగ్‌ హౌస్‌ భారత్‌ కు ఇంతవరకూ ఎటువంటి సమాచారమూ ఇవ్వకపోవడం గమనార్హం. తోషిబా కార్పొరేషన్‌ నిర్ణయంతో వెస్టింగ్‌ హౌస్‌ ఇతర దేశాల్లో చేపట్టిన అణు విద్యుత్‌ ప్రాజెక్టులు కూడా అయోమయంలో పడ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/