Begin typing your search above and press return to search.

నవ్యాంధ్ర రాజధానికి ఖర్చు లెక్క తేలిందా?

By:  Tupaki Desk   |   22 July 2015 6:17 AM GMT
నవ్యాంధ్ర రాజధానికి ఖర్చు లెక్క తేలిందా?
X
సింగపూర్ సర్కారు.. ఏపీ రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చేసింది. ఏ ప్రాంతంలో ఏమేం చేయాలో.. ఏ దశల్లో.. ఏమేం పనులు చేయాలన్న విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.

సింగపూర్ సర్కారు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ను కార్యరూపం దాల్చనున్న నేపథ్యంలో నవ్యాంధ్ర నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? అన్న కీలక ప్రశ్నకు సంబధించి వివరాలు రాని పరిస్థితి. నిజానికి దీనిపై ఇప్పటివరకూ ఒక అంచనా అన్నది లేదు.

అయితే.. ఒక తెలుగు వ్యక్తి.. పన్నెండేళ్లుగా ఓమన్ లో ఒక ప్రైవేట్ కన్సల్టన్సీ లో మేనేజ్ మెంట్ నిపుణుడిగా వ్యవహరిస్తున్న ఎంఎన్ ఆర్ గుప్తా అనే వ్యక్తి రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే నిధుల గురించి లెక్క తేల్చాడు. సింపూర్ సర్కారు.. ఎక్కడ ఏం ఏర్పాటు చేయాలన్న విషయాల్ని మాత్రమే అధ్యయనం చేసి.. మ్యాపులు సిద్ధం చేస్తే.. ఈ తెలుగు వ్యక్తి మాత్రం.. ఎక్కడ ఏ ఏ నిర్మాణాలు అవసరమన్న విషయాన్ని కూడా సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేశారు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఆయన.. తన డీటైల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. తానీ రిపోర్ట్ తయారీకి యాభై మంది అంతర్జాతీయ నిపుణులతో కలిసి పని చేసినట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. ఇందుకయ్యే మొత్తం గురించి వివరిస్తూ.. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కనీసం రూ.3లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ తయారు చేస్తే.. అంతకు మించిన సమగ్ర నివేదికను ఒక తెలుగు వ్యక్తి తనకు తానుగా పూనుకొని పూర్తి చేయటం గొప్ప విషయమని చెప్పక తప్పదు. అంతేకాదు.. ఏపీకి ఎంతమేర ఆర్థిక వనరులు అవసరం అన్న విషయాన్ని కూడా ఒక తెలుగువాడు ప్రణాళికా బద్ధంగా తేల్చటం గొప్ప విషయమే.