Begin typing your search above and press return to search.
మాస్కులకు రూ.22వేల కోట్లు ఖర్చుపెట్టనున్నామా?
By: Tupaki Desk | 19 April 2020 5:15 AM GMTకరోనా పుణ్యమా అని మాస్కులు ధరించకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. ముఖాన్ని కప్పేయటం ఒక ఎత్తు అయితే.. మాస్కుల పేరుతో మొదలైన దందా ఇప్పుడు మరింత ఎక్కువ అవుతోంది. కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లోని అమ్మాయిలు బయటకు వచ్చే ముందు.. ముఖం మొత్తం కవర్ అయ్యేలా.. స్కార్ఫ్ లు కట్టేసుకోవటం తెలిసిందే. కరోనా పుణ్యమా అని వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా మాస్కులు కట్టేసుకుంటున్నారు. ఇదే అదునుగా చూసుకొని.. ఫలానా మాస్కులు మాత్రమే వాడాలంటూ పరిమితులు విధిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మాస్కుల ఖర్చు లెక్కల్లోకి వెళితే అవాక్కు అవ్వాల్సిందే.
ప్రపంచంలోని జనాభా మొత్తానికి మెడికల్ మాస్కులు ఇవ్వాల్సి వస్తే అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రూ.22వేల కోట్లు. 780 కోట్ల జనాభాకు వారానికి దగ్గర దగ్గర 5,500 కోట్ల మాస్కులు అవసరమవుతాయి. అంటే.. వారానికి రూ.22వేల కోట్లు అంటే.. నెలకు రూ.88వేల కోట్లు. ఇక.. వైద్య సిబ్బంది తప్పనిసరిగా వాడాల్సిన ఎన్ 95 మాస్కులు మరింత ఖరీదైనవి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్యులు.. వైద్య సిబ్బందికి ఈ తరహా మాస్కులు ఇవ్వాలంటే రోజుకు పెట్టాల్సిన ఖర్చు ఏకంగా రూ.229 కోట్లు.
ఒకవేళ ప్రజారోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తే.. అయ్యే ఖర్చు భారీగా అవుతుంది. మాస్కులు ధరిస్తేనే వైరస్ వ్యాప్తి ఆగిపోతుందన్న వాదనలో పస లేదు. ఎందుకంటే.. మాస్కును ధరించినా.. చేతుల్ని శుభ్రంగా ఉంచకుండా ఉండటం.. మాస్కుల నిర్వహణ మీద అవగాహన లేని పక్షంలో దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరో కీలకమైన విషయం ఏమంటే.. ప్రపంచం మొత్తంగా ఒక్కరోజులో మాస్కులు వాడి వదిలేసినవి ఏకంగా 800 కోట్ల వరకూ అవుతాయి. అవన్నీ రోజులో చెత్తకుప్పలో చేరతాయి. వాటిని సరైన రీతిలో రీసైకిల్ చేయటం పెద్ద ప్రక్రియ. ఇందుకోసం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాల్సి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. మాస్కులకు ప్రత్యామ్నం ఏమైనా ఉందంటే..మన చేతుల్లోనే ఉంది. ఇంట్లో ఉండే కర్చీఫ్ ల్ని ముఖానికి కట్టేసుకుంటే సరిపోతుంది. రోజు పూర్తి కాగానే.. వాటిని శుభ్రంగా ఉతుక్కొని.. తిరగి వాడటం ద్వారా ఖర్చుకు చెక్ పెట్టటమే కాదు.. మాస్కు వ్యర్థాలను కూడా భారీగా తగ్గించుకోవచ్చు.