Begin typing your search above and press return to search.
పెట్రోల్.. డీజిల్ మీద కేంద్రం తగ్గింపు తర్వాత మొత్తంగా ఎంత తగ్గిందంటే?
By: Tupaki Desk | 4 Nov 2021 4:45 AM GMTపెట్రోల్.. డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రంలోని మోడీ సర్కారు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. లీటరు పెట్రోల్ మీద రూ.5.. లీటరు డీజిల్ మీద రూ.10 చొప్పున తగ్గించిన నేపథ్యంలో.. మొత్తంగా తగ్గింపు ఎంత? అన్నది అసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. కేంద్రం తగ్గించింది ఎక్సైజ్ డ్యూటీని. దాంతో ఇతర పన్నులన్ని కలిపితే.. తగ్గింపు మరింత ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందా? మరింత వివరంగా లెక్కలోకి వెళితే అసలు విషయం మీకే అర్థమవుతుంది.
లీటరు పెట్రోల్ కి మనం చెల్లించేది రూపాయి అయితే.. అందులో దాని అసలు ధరతో పాటు కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ మొదలు బోలెడన్ని ఇతర పన్నులు ఉంటాయి. తాజాగా మోడీ సర్కారు కేంద్రం విధించే ఎక్సైజ్ పన్నులో పది పైసలు తగ్గించింది. అప్పుడు లీటరు పెట్రోల్ తొంభై పైసలు అవ్వదు. ఎందుకంటే.. పన్ను పది పైసలు తగ్గితే.. దాని మీద వేసే ఇతర పన్నుల భారం కూడా తగ్గుతుంది కదా.
తాజాగా ఇలానే మోడీ ప్రభుత్వం పెట్రోల్.. డీజిల్ ధరలు తగ్గించిన నేపథ్యంలో లీటరు మీద మొత్తంగా తగ్గిన మొత్తం ఎంతన్నది చూస్తే.. హైదరాబాద్ విషయానికి వస్తే.. లీటరు పెట్రోల్ మీద మొత్తం పన్నుల భారం తగ్గి రూ.6.33 మేర తగ్గింది. అదే సమయంలోడీజిల్ విషయానికి వస్తే లీటరుకు ఏకంగా రూ.12.79 చొప్పున తగ్గింది. తాజా తగ్గింపుతో లీటరు పెట్రోల్ రూ.108.18కు తగ్గిపోతే.. చాలా రోజుల తర్వాత మళ్లీ డీజిల్ ధర వంద లోపు చేరింది. తాజాగా హైదరాబాద్ లో లీటరుడీజిల్ రూ.94.61కు చేరుకుంది. అంతేకాదు.. చాలా రోజుల తర్వాత లీటరు పెట్రోల్.. డీజిల్ మధ్య ధర వ్యత్యాసం కూడా ఎక్కువైంది.
కొన్ని సంవత్సరాలుగా పెట్రోల్.. డీజిల్ మధ్య తేడా లీటరుకు ఐదు రూపాయిల కంటే తక్కువే ఉంటోంది. తాజాగా మాత్రం అది కాస్తా.. దగ్గర దగ్గర రూ.14 వరకు తగ్గిపోయింది. ఏమైన.. పెట్రోల్ వాహనదారులతో పోలిస్తే.. డీజిల్ వాడకందార్లు మాత్రం ఖుషీ అయిపోతారని చెప్పక తప్పదు.