Begin typing your search above and press return to search.
గరమ్ ఖబర్ : ఏపీలో ఆ ఇద్దరినీ టచ్ చేసి చూడు!
By: Tupaki Desk | 10 Feb 2022 11:30 PM GMTఆంధ్రావనిలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి.ముఖ్యంగా జగన్ మంత్రివర్గంలో ఉన్న కీలక వ్యక్తులు తరుచూ వివాదాలకు, విభేదాలకు కారణం అవుతూ ఉన్నారు. వారిలో ఒకరు కొడాలి నాని కాగా మరొకరు మంత్రి సీదిరి అప్పల్రాజు.ఈ ఇద్దరి వ్యవహార శైలి జగన్కు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి.మొన్నటి దాకా క్యాసినో వివాదం రగిలి రగిలి చల్లారింది అని అనుకునేలోపే మరో వివాదం జగన్ ఇంటిని పలకరించింది.
విశాఖ కేంద్రంగా శారదా పీఠం వార్షికోత్సవాలకు విచ్చేసిన సీఎంను కలిసేందుకు మంత్రి సీదిరి అక్కడికి వచ్చి,విధుల్లో ఉన్న ఆరిలోవ సీఐతో పెను వివాదం రేగింది.విశాఖ కేంద్రంగా రాజకీయ తుఫాను ప్రభజనం సృష్టించింది.దీంతో సీదిరి వ్యాఖ్యలు.. ఆయన సీఐతో నడుచుకున్న తీరు ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఆ విధంగా నిన్నటి వేళ ఆయన ట్రెండ్ సెట్టింగ్ పాయింట్ గా నిలిచారు.నిలుస్తున్నారు కూడా!
వాస్తవానికి మంత్రి కొడాలి నాని భాష కానీ మంత్రి సీదిరి భాష కానీ రాయడానికి వీల్లేని విధంగానే ఉంటుంది.ఎన్నో సందర్భాల్లో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా జరిగిన సమీక్షల్లో అధికారులపై సీదిరి తనదైన భాషతో విరుచుకుపడిన వైనం ఉంది.ఇదే స్థాయిలో స్పీకర్ తమ్మినేని కూడా మాట్లాడతారు. ఇదేస్థాయిలో స్పీకర్ జీవన సహచరి వాణీ సీతారాం కూడా మాట్లాడతారు.ఇదే స్థాయిలో తమకు హోదా ఉన్నాలేకపోయినా కూడా ఆమె సమీక్షలు నిర్వహించి పొందూరు మండల సర్వసభ్య సమావేశంలో అదుపు తప్పిన భాష ఉపయోగించి, ఆధార సహితంగా (వీడియో ఎవిడెన్స్, ఆడియో ఎవిడెన్స్) దొరికిపోయారు కూడా!ఇదే స్థాయిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు కూడా మాట్లాడతారు.
అంటే వీళ్లంతా అధికారులను,ముఖ్యంగా పోలీసులను, ఇంకా ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులను అస్సలు పట్టించుకోకుండా వీళ్లకు నోటికి ఏం అనిపిస్తే అది మాట్లాడి, తరువాత తమ తప్పును కూడా తెలుసుకోకుండా సమర్థనీయ ధోరణిలో మీడియా ఎదుట వివరణలు ఇచ్చి అటు జగన్ పరువూ ఇటు వైసీపీ పరువూ ఏక కాలంలో రోడ్డుకీడుస్తున్నారు.వీరి విషయమై రాష్ట్ర స్థాయిలో ఎన్నోసార్లు చర్చ జరిగినా అటు కొడాలి మొదలుకుని ఇటు సీదిరి వరకూ ఎవ్వరూ కూడా మారిన దాఖలాలు లేవు. ప్రజాగ్రహం ఎంతగా ఉన్నా కూడా వీరి వ్యక్తిత్వంలో నడవడిలో మార్పు అయితే
లేదు. దీంతో వీరి కారణంగా సజ్జల లాంటి పెద్దలు మీడియా ఎదుట సర్ది చెప్పినా కూడా అవన్నీ చెల్లుబాటు కావడం లేదు.