Begin typing your search above and press return to search.
టీడీపీ టికెట్ పోరు, ఇంతలోనే ఎంత తేడా!
By: Tupaki Desk | 19 March 2019 11:24 AM GMTవారం కిందట శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం తెలుగుదేశం పార్టీలో ఒకింత పోటీ నెలకొంది. అయితే ఇప్పుడు అక్కడ అభ్యర్థి ఎవరు అనేది తేల్చడం చంద్రబాబు నాయుడు కు సులభంగా కనిపించడం లేదు. వారం రోజుల్లో అక్కడ సీన్ మొత్తం మారిపోవడం విశేషం!
గత ఎన్నికల్లో శ్రీశైలం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బుడ్డా రాజశేఖరరెడ్డి విజయం సాధించారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి మీద రాజశేఖర రెడ్డి విజయం సాధించారు. అయితే అతి తక్కువ కాలంలోనే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. టీడీపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ పార్టీలోకి చేరిపోయారు.
అలా ఫిరాయించిన బుడ్డాకే చంద్రబాబు నాయుడు ఇటీవల టికెట్ ఖరారు చేశారు. అయితే గతంలో కాంగ్రెస్ తరఫున శ్రీశైలం నుంచి పోటీ చేసి నెగ్గిన నేపథ్యం ఉన్న ఏరాసు ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం అనూహ్యంగా పోటీలోకి వచ్చాడు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పాణ్యం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. మూడో స్థానంలో వచ్చారు. ఈ సారి అక్కడ గౌరు కుటుంబానికి టీడీపీ టికెట్ దక్కుతోంది.
ఈ నేపథ్యంలో ఏరాసుకు ఛాన్స్ లేదు. దీంతో తనకు టికెట్ కావాలని.. శ్రీశైలం కేటాయించాలని ఏరాసు డిమాండ్ చేశారట. అప్పుడు ఆ విషయంలో బుడ్డా తీవ్రంగా స్పందించారు. తనను కాదని ఎలా ఇస్తారని, టికెట్ ఇవ్వకపోతే రాజీనామా అని తేల్చారు. అయితే ఇప్పుడు అదే బుడ్డా రాజశేఖర రెడ్డి టికెట్ ఖరారు అయ్యాకా తప్పుకున్నారు! ఏవేవో రీజన్లు చెబుతున్నారాయన.
ఇలాంటి నేపథ్యంలో టీడీపీ తరఫున అభ్యర్థి ఎవరనేది అంతుబట్టని ప్రశ్నగా మారింది. ఏవీ సుబ్బారెడ్డిని అనుకున్నారట చంద్రబాబు. ఇక ఏరాసు ప్రతాపరెడ్డి ఇప్పుడు ముందుకు రావడం లేదు. ఏవీ కూడా పోటీకి రెడీ కానీ, డబ్బులు ఖర్చు పెట్టేది లేదని అంటున్నారట. ఈ నేపథ్యంలో మరో పేరు కూడా తెర మీదకు వస్తోంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీలో చేరతారని, ఆయనకు శ్రీశైలం టికెట్ ను కేటాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో బైరెడ్డి సత్తా ఏమిటో తేలిపోయింది ఇప్పటికే. నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ఆయన తన పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టారు. కేవలం నూటా నలభై మూడు ఓట్లు వచ్చాయి. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇప్పుడు శ్రీశైలం వచ్చి పోటీ చేస్తే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవడం సులభమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.