Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్
By: Tupaki Desk | 13 Dec 2018 6:31 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో ఓటమి భావన వీడటం లేని సంగతి తెలిసిందే. ముఖ్యనేతలు - సీనియర్ నాయకులు సైతం ఓడిపోవడం ఆ పార్టీలో నైరాశ్యం నింపుతోంది. తమ ముందున్న కర్తవ్యం ఏంటని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. అయితే, ఇదే సమయంలో టీ కాంగ్రెస్ ముందు మరో సమస్య వచ్చిపడింది. అదే పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపిక. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి విషయంలో నేతలు ఏ విధంగా పోటీ పడుతున్నారో...అదే విధంగా ఈ పదవికి సైతం ఆరాట పడుతున్నారు. పార్టీ సీనియర్లలో మల్లు భట్టి విక్రమార్క - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. వీరిద్దరిలో సీఎల్పీ - పీసీసీ పదవులపై పోటీ నెలకొంది. అయితే తానేమి జూనియర్ ను కాదంటూ మంథని నుంచి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం సీఎల్పీ పదవికి పోటీ పడుతున్నారు.
రాష్ట్రంలో త్వరలో కొలువుదీరనున్న నూతన అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ(సీఎల్పీ) నేత ఎవరనే దానిపై సర్వత్రా చర్చ సాగుతున్న ఎపిసోడ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. స్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం రాష్ట్రంలో ప్రచారం చేశారు. తాను కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పార్టీ అధిష్ఠానం కొంతమేర ఉత్తమ్ వైపు మొగ్గే అవకాశాలున్నాయని కొందరు చెప్తుండగా - పార్టీ ఓటమితోపాటు కోదాడలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మావతిరెడ్డి పరాజయం పాలుకావడం కూడా ఉత్తమ్‌కు మైనస్ గా మారుతుందని విశ్లేషిస్తున్నారు. భార్యను గెలిపించుకోలేని ఉత్తమ్ కు మిగిలిన పార్టీ అభ్యర్థులను గెలిపించే సత్తా ఉన్నట్టా? లేనట్టా? అనే విషయం అధిష్ఠానం చూసుకుంటుందని మరికొందరు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి ఉత్తమ్ కు ఉంటుందా? ఊడుతుందా? అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది
కాగా, ఈ హాట్ హాట్ చర్చల సమయంలోనే ఉత్తమ్ ఢిల్లీ బాట పట్టారు. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం పార్టీ ఘోర పరాజయంపై అధిష్ఠానానికి తెలియజేయడం - నూతన అసెంబ్లీలో పార్టీ పక్షనేత పదవి చేపట్టడం - పీసీసీ పదవిపై ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీకి రాష్ట్రంలోని ఓటమి పరిస్థితులు - భవిష్యత్ రాజకీయాలపై తీసుకోవాల్సిన చర్యలు - చేపట్టాల్సిన విధివిధానాలను సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే దానిపై కూడా ప్రాథమిక అంచనా వేసేందుకు మరోమారు భేటీ కావాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి పీసీసీతోపాటు సీఎల్పీ నేతగా కూడా తనకే అవకాశం ఇవ్వాలని ఉత్తమ్ కోరినట్టు సమాచారం. సీఎల్పీ పదవిపై మల్లు బట్టి విక్రమార్క కూడా కన్నేసి పైరవీలు చేస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ఇద్దరిలో ఎవరికనేది రెండు రోజుల్లో తేలనున్నట్టుగా హస్తం పార్టీ నేతలు చెప్తున్నారు.