Begin typing your search above and press return to search.
కేటీఆర్ నోట.. 'టఫ్ వన్ బాస్' మాట
By: Tupaki Desk | 11 March 2018 4:33 AM GMTప్రశ్న ఏదైనా సరే.. ఇట్టే సమాధానం చెప్పేయటం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అలవాటు. ఇబ్బంది పెట్టే ప్రశ్నలకు సైతం సమయస్ఫూర్తితో రిటార్ట్ ఇచ్చే లక్షనం కేటీఆర్ లో కనిపిస్తుంది. మాటలు తడుముకోవటం.. సమాధానానికి ఇబ్బంది పడటం లాంటివి కేటీఆర్ లో అస్సలు కనిపించవు. అలాంటి కేటీఆర్ కు సోషల్ మీడియాలో ఒకరు సంధించిన ప్రశ్నకు ఆయన బదులివ్వకపోవటమే కాదు.. టఫ్ వన్ బాస్ అంటూ ట్వీట్ చేసిన వైనం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటే కేటీఆర్ చేత టఫ్ వన్ బాస్ అన్న మాటను చెప్పించిన ప్రశ్న ఏమిటన్నది చూస్తే.. హైదరాబాద్ లోని హోటళ్ల టైమింగ్స్.. కొన్నిచోట్ల జీఎస్టీ వసూలు చేయటం.. మరికొన్నిచోట్ల వసూలు చేయని వైనాన్ని ప్రస్తావించటం గమనార్హం.
నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ ట్వీట్ కు కారణంగా బోడుప్పల్ కు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ కు ఒక సందేహాన్ని ట్వీట్ చేశారు. వెజిటేరియన్ ఫుడ్ అయిన ఇడ్లీ.. దోసె.. వడ లాంటి వాటిని అందించే హోటళ్లు బోడుప్పల్ లో రాత్రి 10 గంటలకే మూసివేస్తున్నారని..జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో నాన్ వెజ్ తినే తన స్నేహితుడికి బిర్యానీ.. రోటీ లాంటివి పాతబస్తీలో 24 గంటలూ లభ్యమవుతున్నాయని.. జీఎస్టీ కూడా వసూలు చేయటం లేదని పేర్కొన్నారు. తమ సమస్యను తీర్చాలంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్.. టఫ్ వన్ బాస్ అంటూ ఒక ముక్కలో తేల్చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్లు మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పాతబస్తీలో అంతే.. రూల్స్ నడవవు అని కొందరంటే.. బోడుప్పల్ నుంచి పాతబస్తీకి షిఫ్ట్ అయిపో.. అదే టైంలో వెజ్ నుంచి నాన్ వెజ్ కు మారు అంటూ కామెంట్లు చేయటం కనిపించింది. మొత్తంగా కేటీఆర్ చేత సూటి సమాధానం చెప్పించలేని క్రెడిట్ ప్రకాశ్ కు దక్కిందని చెప్పక తప్పదు.