Begin typing your search above and press return to search.
కేబినెట్ ఏర్పాటు.. కత్తిమీద సామే!
By: Tupaki Desk | 5 Aug 2019 4:48 AM GMTపలు నాటకీయ పరిణామాల మధ్య అధికారం చేపట్టిన బీఎస్ యడియూరప్ప అన్నీ తానై వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గత జూలై 26వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప అదే నెల 29న బల పరీక్షలో నెగ్గారు. అయితే వారం రోజులు పూర్తయినా.. ఇప్పటి వరకు కేబినెట్ ఏర్పాటు చేయలేదు. కానీ సీఎం హోదాలో నిర్ణయాలు మాత్రం తీసుకుంటున్నారు. ఇప్పటికే వారం గడిచింది. మరో వారం రోజులు గడిస్తే కానీ కేబినెట్ ఏర్పడే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రివర్గం ఏర్పాటుకు ఇంకా పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని యడియూరప్ప చెబుతున్నారు. కాగా 33 మంత్రి పదవులకు గానూ సుమారు 50 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఎవరికి ఇవ్వాలో? ఇవ్వకూడదో అని పార్టీ పెద్దలు టెన్షన్ లో పడ్డారు. దీనికి తోడు కేబినెట్ బెర్తు రాకుంటే కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో బీజేపీ పెద్దలకు రివర్స్ ఆపరేషన్ భయం పట్టుకోవడంతో కేబినెట్ ఏర్పాటుపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కారణంగా గత రెండు నెలలుగా పాలన అటకెక్కింది. అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా - బుజ్జగింపులు - మంత్రుల రాజీనామా - విశ్వాస పరీక్ష - రిసార్టులకు ఎమ్మెల్యేలు తదితర కార్యక్రమాలు పూర్తయ్యే సరికి సీఎంగా కుమారస్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కర్ణాటక సీఎంగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసినప్పటికీ పాలన సజావుగా సాగలేదు. ఉత్తర కర్ణాటక అతివృష్టితో అల్లాడిపోతోంది. అయితే సీఎం యడియూరప్ప బెంగళూరు నగరానికే పరిమితం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి జనాల సమస్యలు తెలుసుకునే వారు కూడా కరువయ్యారు. అక్కడక్కడా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు కోసం ఎవరికి వారు లాబీయింగ్ చేసేందుకు పార్టీ కార్యాలయాలు - నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలో పాలన మళ్లీ అటకెక్కింది. బీజేపీ పాలనలో కూడా పథకాల అమలు అంతంత మాత్రంగానే ఉందని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బీఎస్ యడియూరప్ప తొలిసారిగా సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈమేరకు పార్టీ పెద్దలతో మంత్రివర్గం ఏర్పాటు గురించి చర్చించి తుది జాబితా తీసుకుని వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు ఈనెల 12వ తేదీన కేబినెట్ ఏర్పాటు చేస్తారని తెలిసింది. నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం యడియూరప్ప ఢిల్లీలోనే ఉంటారు. కాగా సీఎం యడియూరప్ప గత మూడు రోజులుగా పలు శాఖల అధికారులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఎక్కడా అవినీతి జరగకూడదని హెచ్చరించారు. అంతేకాకుండా ఐఏఎస్ - ఐపీఎస్ ల బదిలీలు కూడా చేశారు. అయితే ఆయా శాఖలకు మంత్రులు లేకపోవడంతో అధికారుల్లో క్రమశిక్షణ లేకుండా పోతోందనే విమర్శలు ఉన్నాయి.