Begin typing your search above and press return to search.
కన్నడలో అంపశయ్య సర్కారు
By: Tupaki Desk | 19 Jun 2019 9:45 AM GMTకన్నడ నాట జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటముల తర్వాత బీజేపీ కర్ణాటకలో బలం పుంజుకోగా.. కాంగ్రెస్, జేడీఎస్ లు కోలుకోకుండా ఉన్నాయి. తాజా ఓటమితో కుమారస్వామి ప్రభుత్వంపై అసంతృప్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో కుమారస్వామి ప్రభుత్వం ఏ క్షణాన కూలిపోతుందనే ఉత్కంఠ మరోసారి నెలకొంది.
గత నెలలో సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు గోడ దూకుతారనే టెన్షన్ సీఎం కుమారస్వామికి నెలకొంది. ఇక కాంగ్రెస్ డిమాండ్లు తీర్చలేక తనకు ఓపిక చచ్చిపోయిందని కుమారస్వామి నిర్వదేం వ్యక్తం చేయడం .. పాలన గాడి తప్పడంతో ఎప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్ వెంటాడుతోంది.
ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేల కప్పదాట్లు, జేడీఎస్ సీఎం కుమారస్వామి నిర్వేదంతో కాంగ్రెస్ కూడా అలెర్ట్ అయ్యింది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఐదేళ్లు కర్ణాటకలో పాలిస్తుందని తాజాగా కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే బీజేపీ మాత్రం కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోయడానికి సిద్ధంగా ఉన్నా మోడీ మాత్రం అలా చేయవద్దని ఆదేశాలు పంపడంతో ఊరుకుంటున్నారు.
కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం కష్టమైన పని అని కుమారస్వామి తాజాగా నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియక ప్రజాసమస్యలను పట్టించుకునే స్థితిలో లేమని వ్యాఖ్యానించడం కలకల రేపుతున్నాయి. దీన్ని బట్టి ప్రభుత్వం రేపోమాపో కూలిపోవడం ఖాయమంటున్నారు.