Begin typing your search above and press return to search.
అనకాపల్లి జిల్లా సెజ్ లో విషవాయువు లీక్.. వారి కష్టం పగోడికి వద్దు
By: Tupaki Desk | 4 Jun 2022 3:18 AM GMTవస్త్ర పరిశ్రమ నుంచి వెలువడిన విష వాయువులు వందలాది మందిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అసలేం జరుగుతుందో అర్థం కాక తల్లడిల్లిపోయారు. ఊరికి దగ్గర్లో భారీ పరిశ్రమ ఏర్పాటైన వేళలో సంతసించే వారు.. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్న వేళలో మాత్రం ఉపాధి కల్పిస్తుందని చెప్పే పరిశ్రమల మాటున ఎంతటి రిస్కు ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లుగా కనిపించక మానదు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చోటు చేసుకున్న ఈ ఉదంతం బారిన పడినోళ్లు.. కోలుకోవటానికి గంటల సమయం పట్టిందని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని సీడ్స్ వస్త్రపరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువులు వెలువడ్డాయి. మరో రెండు గంటల్లో షిప్టు పూర్తి అయి.. ఇంటికి వెళ్లాల్సిన వేళలో అనూహ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గాఢమైన విష వాయువు లీకైంది. దీంతో.. అక్కడ పని చేస్తున్నమహిళా కార్మికులు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఊపిరి పీల్చుకోలేకపోయిన వారు.. భయాందోళనలతో ఒక్కసారిగా పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు.
అదే సమయంలో లీకైన విష వాయువు బయట వాతావరణంలో కలిసిపోవటంతో.. బయటకు వెళ్లిన వారు సైతం విష వాయువు ప్రభావానికి తల్లడిల్లారు. అదే సమయంలో కంపెనీకి చెందిన సిబ్బంది సూచనతో పలువురు లోపలకు వెళ్లిపోయారు. మరికొందరికి మాత్రం అప్పటికే వాంతులు మొదలయ్యాయి. కొందరు స్ర్పహ కోల్పోయారు. ఏ షిఫ్టుకు మొత్తం 2 వేల మంది కార్మికులు హాజరు కాగా.. దాదాపు 300 మంది ఉద్యోగినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పలువురు ఒక మోస్తరు అస్వస్థతకు గురయ్యారు. మొత్తంగాబాధితుల సంఖ్య దాదాపు 75 శాతానికి పైనే ఉంటుందని చెబుతున్నారు.
దీంతో పలువురు బాధితుల్ని కంపెనీకి చెందిన అంబులెన్సుల్లో అచ్యుతాపురానికి తరలించారు. అయితే.. ఈ ప్రమాదం జరిగిన గంటల వరకు అచ్యుతాపురానికి వైద్య సిబ్బందిని జిల్లా యంత్రాంగం పంపించకపోవటం గమనార్హం. వైద్యం కోసం వచ్చిన వారు.. వైద్యుల కోసం ఎదురుచూస్తూ రోడ్ల మీద.. మెట్ల మీద.. నేల మీద స్ప్రహ తప్పిపోయిన వైనం షాకింగ్ కు గురి చేసింది. వైద్య సేవల కోసం బాధితులు చేసిన ఆర్తనాదాలు చూపురులను కలిచివేసేలా చేశాయి. ఇంత జరుగుతున్నా.. జిల్లా వైద్యాధికారులు మాత్రం అవసరమైన వైద్య సిబ్బందిని హుటాహుటిగా అచ్యుతాపురానికి పంపటంలో విఫలమయ్యారన్న మాట వినిపిస్తోంది.
ఈ ఉదంతంలో ఏడు నెలలతో ఉన్న గర్భిణులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వారి వేదనను ఎలా తీర్చాలో అర్థం కాని పరిస్థితి. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత 120 మంది బాధితుల్నిఅనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని అనకాపల్లిలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చారు. విత్తన కంపెనీలో లీకైన విష వాయువు ఏమిటి? అసలీ ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. జరిగిన దారుణానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించే విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విష వాయువు అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా లీకైంది? అన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం. తాజాగా అచ్యుతాపురం విష వాయువు ప్రమాదాన్ని చూసినప్పుడు రెండేళ్ల క్రితం విశాఖలో ఎల్ జీ పాలిమర్స్ కంపెనీ ప్రమాద ఉదంతం గుర్తుకు రాక మానదు. అప్పటి ప్రమాదంలో బాధితులు రోడ్ల మీదకు వచ్చి కుప్పకూలినట్లే.. తాజా ఉదంతంలోనూమహిళా కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు.
విష వాయువు ప్రభావం దాదాపు 12 కిలోమీటర్ల వరకు ఉండటం గమనార్హం. పరిశ్రమ ఉన్న అచ్యుతాపురంలోని ప్రజలు విష వాయువు లీక్ తో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు ఆగమేఘాల మీద స్పందించాల్సిన యంత్రాంగం మాత్రం అందుకు తగ్గట్లు స్పందించలేదని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వ ప్రకటన ఒకలా ఉంటే.. విపక్షాలు మాత్రం ప్రభుత్వ తీరునుతప్పు పడుతూ విరుచుకుపడ్డారు. మొత్తంగా.. విష వాయువు లీక్ వ్యవహారం సామాన్యుడికి మాత్రం తీవ్రమైన షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.