Begin typing your search above and press return to search.
చుట్టూ విషం : విశాఖలో ఏం జరుగుతోంది...?
By: Tupaki Desk | 3 Jun 2022 1:30 PM GMTవిశాఖ జిల్లా అంటేనే అంతా ఒక ప్రత్యేకమైన అభిమానంతో చూస్తారు. విశాఖ జిల్లా ప్రశాంతమైనదిగా భావిస్తారు. ఇక ఉద్యోగ ఉపాధి నిమిత్తం చాలా మంది ఇక్కడకు వచ్చి కాపురం ఉంటారు. అలాంటి విశాఖ గత కొన్నేళ్ళుగా భయపెడుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో పోరస్ కంపెనీ నుంచి విషవాయువు ఈ రోజు లీకైంది. ఈ వాయువు ప్రభావంతో కంపెనీ పక్కనే క్వాంటమ్ సీడ్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో అధికారులు మేలుకున్నారు. ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. నిజానికి ఈ ఘటన ఎందుకు జరిగింది అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇది మొదటిది కాదు అనే చెప్పాలి. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలలా పరిశ్రమలు ఉన్నాయి. అందులో రసాయనాలు చాలా ఉన్నాయి. గ్యాస్ లీక్ సంఘటనలు కూడా తరచూ జరుగుతూండడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఎపుడూ భయపడుతూనే ఉంటున్నారు. దీంతో అసలు ఏం జరుగుతోంది అన్న కంగారు భయం అయితే అందరిలో ఏర్పడుతోంది.
ఇక ఆయా కర్మాగారాలలో పనిచేసే వారి సంగతి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పరవాడలో రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ కూడా తరచుగా గ్యాస్ లీకేజ్ ఘటనలు జరుగుతూ ఉంటాయి. మరో వైపు చూస్తే సెజ్ కి మారు పేరుగా ఉన్న అచ్యుతాపురంలోనూ గ్యాస్ లీకేజి ఘటనలు చోటుచేసుకోవడంతో అంతా కలవరపడుతున్నారు.
ఇప్పటికి సరిగ్గా రెండేళ్ళ క్రితం అంటే 2020 మే 7న విశాఖ సిటీ శివారులోని పెందుర్తిలో ఎల్జీ పాలిమార్స్ లో గ్యాస్ లీకేజి ఘటనలో ఏకంగా పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే ఈ రోజుకీ చాలా మంది ఆ విషం శరీరంలోకి వెళ్ళి నానా రకాలైన అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్నారు.
ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే భద్రతాపరమైన ప్రమాణాలు పాటించకపోవడం, అధికారులు చూసీచూడనట్లుగా వదిలేయడం, అదే సమయంలో కర్మాగరాలు అన్ని రకాలైన నిబంధనలను గాలిలోకి వదిలివేసినా ఎవరూ అడిగే నాధుడు లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు
ఇక జనవాసాలకు దగ్గరగా పరిశ్రమలు ఉండడం కూడా ప్రమాదాలను పెంచే పరిణామంగా ఉంటోంది. ఈ విషయంలో కూడా పలుకుబడి, రాజకీయాలే పెద్ద పాత్ర పోషించడం వల్ల విషం చుట్టూ పెట్టుకుని జనాలు వాటిని పీల్చాల్సి వస్తోంది. పరవాడలోని సెజ్ ల వల్ల తాడి గ్రామం మొత్తం అక్కడ పరిశ్రమల వల్ల కాలుష్యం అయిపోయింది. తాగే నీరు, పీల్చే గాలి అన్నీ విషయమే.
దాని మీద ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినతి చేసినా పట్టించుకోని పరిస్థితి. తాడి గ్రామాన్ని తరలించాలని ఈ మధ్యనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలా పరిశ్రమలను ప్రమాణాలు పాటించేలా చూడడం, అదే సమయంలో జనవాసాలకు కర్మాగారాలు దూరంగా ఉంచడం వంటివి చేయకపోతే మాత్రం ఈ విషమే విశాఖను కమ్మేసి ఏదో రోజున మింగేసినా ఆశ్చర్య లేదని, ఆ విషాదం జరగకముందే అంతా మేలుకోవాలని అంటున్నారు.
దీని మీద విపక్షాలు అయితే ప్రభుత్వాన్నే నిందిస్తున్నాయి. పరిశ్రమల మీద సరైన చెకింగ్ లేదని కూడా ఆరోపిస్తున్నారు. విశాఖ గురించి చెప్పమని జనసేన నాయకుడు నాగబాబుని మీడియా అడిగితే ఆయన చెప్పిన సమాధాం ఏంటంటే విశాఖ బాగానే ఉంది కదా అపుడపుడు విష వాయువులు, గ్యాస్ లీకేజ్ కావడం అంటూ వైసీపీ సర్కార్ మీద వేసిన సెటైర్ మంట పుట్టించేదే. ఆయన అలా అన్నారని కాదు, ఏం చేయాలని ఆలోచన చేస్తేనే ఈ రకమైన విష వాయువుల లీకేజి కి అడ్డుకట్ట పడుతుందేమో.