Begin typing your search above and press return to search.

టొయోటా సంచలనం..తాజా కారుతో మరో సంచలనం

By:  Tupaki Desk   |   22 Oct 2019 4:22 AM GMT
టొయోటా సంచలనం..తాజా కారుతో మరో సంచలనం
X
దేశంలో కార్లను తయారు చేసే కంపెనీలు బోలెడన్ని ఉన్నా.. కొన్నికంపెనీలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడిదాకానో ఎందుకు? ప్రముఖులు వినియోగించే కార్లలో టయోటాకు సంబంధించిన ఒక కారు తప్పనిసరిగా ఉండటం కనిపిస్తుంది. దేశంలో తిరుగులేని ఆదరణ ఉన్న బ్రాండ్లలో టొయోటా ఒకటి. అలాంటి ఈ సంస్థ తాజాగా ఒక సంచలానికి తెర తీసింది.

చూసినంతనే మనసు పారేసుకునేలా ఒక బుల్లి బ్యాటరీ కారును రూపొందింది. అయితే.. ఈ కారులో కేవలం ఇద్దరు మాత్రమే ట్రావెల్ చేసే వీలుంది. 8.16 అడుగుల పొడవు.. 4.23 అడుగుల వెడల్పుతో పాటు 5.11 అడుగుల ఎత్తు ఉండే ఈ కారు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ కారుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఐదు గంటల పాటు ఛార్జ్ చేస్తే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వంద కిలోమీటర్లు ట్రావెల్ చేసే వీలుందని చెబుతున్నారు. నగరాలకు సూట్ అయ్యే ఈ కారు.. ప్యూచర్ కారుగా అబివర్ణిస్తుననారు. చూసేందుకు బుజ్జిగా ఉండటంతో పాటు.. ఎలక్ట్రికల్ కారు కావటం.. ట్రాఫిక్ లో తేలిగ్గా ప్రయాణించేలా ఉన్న ఈ డిజైన్ బాగుందన్న పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది.

అయితే.. తాను విడుదల చేయాలనుకుంటున్న ఈ కారును కేవలం జపాన్ లో మాత్రమే అమ్మకాలు జరుపుతారని చెబుుతున్నారు. టోక్యోలో త్వరలో జరిగే మోటార్ షోలో ఈ సరికొత్త కారును టొయోటా ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని మహానగరాల్లో నెలకొన్న ట్రాఫిక్ కు సరిగా సూట్ అయ్యే ఈ కంపాక్ట్ కారు జపాన్ కు మాత్రమే పరిమితం కావటం నిరాశ కలిగించే అంశంగా చెప్పక తప్పదు. తమ ఉత్పత్తులను భారత్ కు సూట్ అయ్యేలా కంపెనీలు ప్రత్యేకంగా వ్యూహాలు నిర్మిస్తున్న వేళ.. టొయోటా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం గమనార్హం.