Begin typing your search above and press return to search.
ఆ మంత్రి సీటుకు రేవంత్ ఎసరు.. పోటీ అక్కడి నుంచేనా..!
By: Tupaki Desk | 21 May 2022 3:30 AM GMTటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఈసారి నియోజకవర్గం మారనున్నారా..? దక్షిణ తెలంగాణ మంత్రి స్థానానికి ఎసరు పెట్టబోతున్నారా..? ఇక ఆయన ఆశలు వదులుకోవాల్సిందేనా..? అంటే కాంగ్రెస్ వర్గాలు అవుననే అంటున్నాయి. క్రితం ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలోని మల్కాజిగిరి నుంచి విజయం సాధించారు.
అయితే రేవంత్ ఈసారి ఎంపీ ఎన్నికల్లో కాకుండా అసెంబ్లీకి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తన పూర్వపు స్థానమైన కొడంగల్ నుంచే పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఈ నియోజకవర్గం మునుపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండగా.. తర్వాత వికారాబాద్ జిల్లా పరిధిలో చేర్చారు. రేవంతుకు నష్టం చేకూర్చేందుకే ఇలా చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈసారి తిరిగి కొడంగల్ నుంచే పోటీ చేసి విజయం సాధిస్తారని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఈ విషయంపై రేవంత్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయన పోటీ చేసే నియోజకవర్గంపై రకరకాల ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. కొడంగల్ లో ఆయన సోదరుడిని పోటీ చేయించి తను గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక స్థానం నుంచి బరిలో నిలవాలని రేవంతు భావిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలంగా ఉన్న ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, మల్కాజిగిరి నుంచి ఏదో ఒక స్థానంలో పోటీ ఖాయమని అంటున్నారు. దీనివల్ల గ్రేటర్ లో పార్టీ పుంజుకొని మిగతా స్థానాలపై ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రేవంత్ పోటీపై పార్టీలో మరో రకమైన వాదన వినిపిస్తోంది. పార్టీ నాయకత్వం బలహీనంగా ఉన్న కల్వకుర్తి నుంచి ఆయన బరిలో ఉంటే బాగుంటుందని నేతలు సూచిస్తున్నారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. ఇదిలా ఉండగానే ఆయన పోటీ చేసే స్థానంపై మరో ఊహాగానం వినిపిస్తోంది.
ఇటీవల మహబూబ్ నగర్ నియోజకవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు రేవంతును కలిసి పార్టీ పరిస్థితిని వివరించారట. అలాగే నియోజకవర్గంలోని సమస్యలను ఏకరువు పెట్టారట. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచకాలను వివరించారట. అలాగే రేవంత్ మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని సూచించారట. దీనికి రేవంత్ కూడా సానుకూలంగా స్పందించారట. అదే నిజమైతే ఇక శ్రీనివాస్ గౌడ్ వేరే నియోజకవర్గం వెతుక్కోవాల్సిందేనని నేతలు భావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో..!