Begin typing your search above and press return to search.
మోడీజీ.. దమ్ముంటే కాళేశ్వరం అవినీతిని వెలికితీయి.. రేవంత్ సంచలన లేఖ
By: Tupaki Desk | 26 May 2022 2:30 PM GMTతెలంగాణలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన రాజకీయవేడి పుట్టించింది. ప్రధాని పర్యటనకు టీఆర్ఎస్ 17 ప్రశ్నలతో వేయించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపింది. మోడీ రూట్లోనే వీటిని పెట్టి షాకిచ్చింది. మోడీ ముఖం చూసే ఇష్టం లేక కేసీఆర్ కర్ణాటకకు వెళ్లిపోయారు. ఇక హైదరాబాద్ కు వచ్చిన మోడీజీ రెచ్చిపోయారు. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ వెనక్కి వెళ్లిపోతోందని.. ఆయన మూఢ నమ్మకాలతో భ్రష్టు పడుతోందని విమర్శించారు.
తెలంగాణలో ఓ వైపు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ వార్ జరుగుతుంటే వీరిద్దరి లోపాయికారి స్నేహాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ‘మోడీజీ ఈ 9 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి’ అంటూ రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ సంధించారు. తెలంగాణ ప్రజల తరుఫున అడుగుతున్నానని.. కనీసం ఈ ప్రశ్నకైనా జవాబు చెబుతారా? అని నిలదీశారు. ఐఎస్బీలో విద్యార్థులు ప్రశ్నించకుండా కసరత్తు చేశారని.. కానీ మేం ప్రశ్నిస్తామని 9 ప్రశ్నలను అడిగారు.
-రేవంత్ రెడ్డి ప్రశ్నలివీ..
-కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న జేపీ నడ్డా విమర్శలపై ఎందుకు కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించడం లేదు? ఏ చీకటి స్నేహం మిమ్మల్ని ఆపుతోంది?
-పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైంది?
-తెలంగాణ రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ అతీగతీ లేకుండా పోయింది.
-ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎందుకు తెరవడం లేదు.
-కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయం ఏమైంది?
-నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఏమైంది?
-ఐటీఐఆర్ రద్దు చేశారని.. స్టీల్ ఫ్యాక్టరీ ఊసేలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
-ఒడిశాలోని నైనికోల్ మైన్స్ టెండర్ల కుంభకోణంలో కేసీఆర్ బంధువుల పాత్ర ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.? ఎందుకు?
-ధాన్యం కొనుగోలు విషయంలో డ్రామాలాడి రైతులకు నష్టం చేసింది మీరు కాదా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
-కేసీఆర్ పై ఈగ వాలకుండా కాపాడుతున్నది మీరు కాదా? అంటూ మోడీని నిలదీశారు
-భద్రాద్రి రాముడికి రామాయణ సర్య్కూట్లో ఎందుకు చోటు ఇవ్వలేదు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏం చేయబోతోందో చెప్పాలని మోడీకి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్నలు వేశారు.
రేవంత్ రెడ్డి సంధించిన ప్రశ్నలు చూస్తే మోడీ, కేసీఆర్ కలిసి నాటకాడాలుతున్నట్టు తెలుస్తోందని కాంగ్రెస్ వాదులు అంటున్నారు. తెలంగాణ ప్రజలు అంటే మోడీకి చులకన అన్న భావాన్ని కాంగ్రెస్ ఎత్తి చూపుతోంది. గడిచిన పార్లమెంట్ సమావేశాల సందర్భంలో తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను గాయపరుస్తూ మీరు మాట్లాడిన తీరు అభ్యంతరకరమైన మాటలను వెనక్కి తీసుకోవాలని.. తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి కాస్త గట్టిగానే మోడీకి లేఖలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటివరకూ ఏవీ నెరవేర్చారో చెప్పాలన్నారు. మొత్తంగా ఇటు కేసీఆర్ ను.. అటు మోడీని ఇరుకునపెట్టేలా రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.