Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డి వైరల్ పిక్స్.. ఎక్కడున్నాడో తెలుసా?
By: Tupaki Desk | 3 Jun 2022 2:48 PM GMTతెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీ-కాంగ్రెస్ మినీ చింతన్ శిబర్‌కు గైర్హాజరు కావడం అందరినీ కలచివేసింది. అయితే రేవంత్ ఎక్కడ? అని అందరూ ఆరాతీస్తుంటే అతడు మాత్రం అమెరికాలో వాలిపోయాడు. రేవంత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పరిశీలిస్తే అతను ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని డల్లాస్ లో ఉన్నాడు.
తన యుఎస్ టూర్‌లో రేవంత్ ఎన్నారై కమ్యూనిటీ నుండి మద్దతు కూడగట్టడం కోసం అక్కడ పర్యటిస్తున్నారు. . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డల్లాస్‌లో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే 6000 ఎకరాలు సాగు చేస్తున్న రైతును రేవంత్ అడిగితెలుసుకున్నారు.
తన వ్యవసాయ సందర్శన చిత్రాలను పంచుకుంటూ, రేవంత్ ఇలా రాశాడు, "డల్లాస్‌లో 6000 ఎకరాల భూమిని సాగు చేస్తున్న రైతు మైక్ ఫాలన్‌ను సందర్శించాను... నేను వ్యవసాయ పాలసీలు, ఖర్చులు, బీమా, అమెరికా ప్రభుత్వ మద్దతు మరియు పంట సాధ్యత గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను.. మంచి అనుభవం..." అని రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు.
వారాంతంలో రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.. రైతు రచ్చబండను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర సమయం ఉండటంతో ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న రైతులను తమవైపు తిప్పుకునేందుకు రేవంత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను రేవంత్, టీ-కాంగ్రెస్‌లు తమను అధికారంలోకి తీసుకొచ్చే ఆయుధంగా భావిస్తున్నారు.