Begin typing your search above and press return to search.

భయపెట్టడానికి పావులు కదుపుతున్న రేవంత్

By:  Tupaki Desk   |   10 July 2022 11:30 PM GMT
భయపెట్టడానికి పావులు కదుపుతున్న రేవంత్
X
ఆగ‌స్టులో రాహుల్ స‌భ ఉంటుంద‌ని ప్ర‌ధాన మీడియా అంటోంది. ఎలా అయినా ప్ర‌ధాన జాతీయ పార్టీ బీజేపీకి దీటుగానే ఓ స‌భ పెట్టి  స‌క్సెస్ చేసి జ‌నంలో త‌మ హ‌వాను చాటేందుకు చాలా అంటే చాలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది టీపీసీసీ. రేవంత్ కూడా సభ నిర్వ‌హ‌ణ ఆలోచ‌న‌కు ఓటేశారు. అదేవిధంగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అయిపోయాక మ‌రింత పోరు ఉద్ధృతం చేసే ఆలోచ‌న‌కు వ‌చ్చారు అని తెలుస్తోంది.

గ‌తం క‌న్నా వేగంగా కాంగ్రెస్ ప‌రిణామాలు ఉండ‌నున్నాయి. స‌భ నిర్వ‌హించి తెలంగాణ రాష్ట్ర స‌మితి చేస్తున్న త‌ప్పిదాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల‌ని, అప్ప‌టికి రాహుల్ తోనే ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యే విధంగా ఒక‌టో రెండో హామీలు ఇప్పించాల‌న్నది కూడా రేవంత్ అండ్ కో ప్లాన్. నాయ‌కులంతా ఏక‌తాటిపై న‌డిస్తే కాంగ్రెస్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండో ప్లేస్ క‌న్ఫం అని అంటున్నాయి  స‌ర్వేలు. ఇప్ప‌టికిప్పుడు అధికారం రాకున్నా కూడా గుడ్ పెర్ఫార్మ‌ర్ గా రేవంత్ కు పేరు రావ‌డం కూడా ఖాయం అని కొంద‌రు ప‌రిశీల‌కులు అంటున్న మాట.

వ‌రుస స‌భ‌ల‌తో బెంబేలెత్తిస్తున్న బీజేపీకి ఝ‌లక్ ఇవ్వ‌డాన్నే ప్రామాణికంగా తీసుకుని వ‌రుస స‌భ‌లు నిర్వ‌హించింది. అదేవిధంగా అధికార పార్టీని తిట్టిపోసింది. బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వానికి దీటుగా తామున్నామ‌న్న భావ‌న‌ల‌ను సంకేత రూపంలో మార్చి ప్ర‌జ‌ల్లోకి పంపేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది. బీజేపీకి పోటీగా కేసీఆర్ -పై పోరుకు సిద్ధం అవుతోంది. తొలిసారి కేటీఆర్ ఇలాకాలో భారీ బ‌హిరంగ స‌భ‌కు ప్లాన్ చేస్తోంది. సిరిసిల్ల‌లో జ‌రిగే ఈ భారీ బ‌హిరంగ స‌భ‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే స‌మాలోచ‌న‌లు సాగుతున్నాయి అని స‌మాచారం. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా అయినా త‌న స‌త్తా చాటుకోవాల‌ని కాంగ్రెస్ యోచిస్తోంది. ఓ స‌ర్వే ప్ర‌కారం అర‌వై నుంచి డ‌బ్బై సీట్లు వ‌చ్చినా కాంగ్రెస్ ప‌రువు నిల‌బ‌డిన‌ట్లే ! అందుకు అనుగుణంగా రాహుల్ తో వ‌రంగ‌ల్ స‌భ త‌రువాత మరో స‌భ నిర్వ‌హ‌ణ‌కు కాంగ్రెస్ సిద్ధం అవుతోంది.

ముఖ్యంగా రేవంత్ స‌న్నిహిత‌డు మాజీఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి బీజేపీకి వెళ్ల‌డం నిజంగానే ఓ షాక్. రేవంత్ ఎంత ట్రై చేసినా ఆఖ‌రి నిమిషంలో ఈట‌ల మంత్రాంగం ప‌నిచేసి ఆయ‌న అటు వెళ్లార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీ బ‌లోపేతానికి మ‌రో స‌భ  నిర్వ‌హించి ముఖ్య నాయ‌కుల‌ను ఒకే వేదిక‌పై తెచ్చి, ఐక్య‌త చాటాల‌న్న‌ది రేవంత్ అండ్ కో వ్యూహం. ఇప్ప‌టికే కేటీఆర్ లాంటి బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఢీ కొన‌డం సులువు కాద‌ని నిరూప‌ణ అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ మాత్రం త‌న ప‌ట్టుద‌ల‌ను మ‌రింత పెంచి పోరాట స్ఫూర్తిని ఎన్నిక‌ల క్షేత్రంలో చాటేందుకు స‌న్న‌ద్ధం కావ‌డం విశేషం.