Begin typing your search above and press return to search.
ములుగులో సమ్మక్క.. మునుగోడులో సారక్క.. రేవంత్ సెంటిమెంట్ టచ్
By: Tupaki Desk | 16 Oct 2022 1:30 PM GMTతెలంగాణ రాజకీయాల్లో ప్రజల మనసులను అత్యంత హత్తుకునేలా మాట్లాడగలిగేది ఇద్దరే ఇద్దరు. ఒకరు సీఎం కేసీఆర్ అయితే, మరొకరు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పరిస్థితులకు సామెతలను జోడించి.. చెప్పదల్చుకున్నది సూటిగా గుండెల్లోకి చేరేలా చెప్పడం వీరి నైజం. అందుకే వీరి ప్రెస్ మీట్ లన్నా.. బహిరంగ సభలన్నా ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. ఆ సమయంలో చానెళ్ల టీఆర్పీలు అమాంతం పెరిగిపోతుంటాయి.
సెంటిమెంటచ్
సెంటిమెంట్ టచ్ రగిలించడంలో కేసీఆర్ ఏపాటి ప్రావీణ్యులో అందరికీ తెలిసిందే. అందులోనూ తెలంగాణ వాదాన్ని ఆయన ఎత్తుకున్న తీరు చాలా చక్కటి ఉదాహరణ. ఏమాత్రం అవకాశాలు లేని స్థితిలో తెలంగాణ ప్రస్తావన కూడా నేరంగా మారిన పరిస్థితుల్లో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర వాదాన్ని పైకి తెచ్చారు. అంతెందుకు..? 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. టీడీపీ-కాంగ్రెస్-వామ పక్షాల కూటమిని ఎదుర్కొన్న సందర్భంలో ఒకానొక దశలో టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీచింది.
అదే సమయంలో టీడీపీ అధినేత, ఏపీ అప్పటి సీఎం చంద్రబాబును చూపి కేసీఆర్ తెలంగాణ వాదం అనే సెంటిమెంట్ ను టచ్ చేశారు. దీంతో ప్రజలు కారు గుర్తుకు గుద్దేశారు. అలా ఉంటుంది.. మరి కేసీఆర్ సెంటిమెంట్ టచ్. ఇక రేవంత్ విషయానికి వస్తే.. 'కూట్లో రాయితీయలేని వాడు ఏటో రాయిని తీస్తాడంట'వంటి సామెతలను జోడించి ప్రసంగాలు చేయడంలో, ప్రెస్ మీట్లను రంజింప జేయడంలో సిద్ధహస్తులు. ఈ వాక్చాతుర్యమే ఆయనను కాంగ్రెస్ లో ఎంతమంద సీనియర్ల ఉన్నప్పటికీ అనతి కాలంలోనే ప్రతిష్ఠాత్మక పీసీసీ పదవి దక్కేలా చేసింది.
మునుగోడులో ఆ ప్రస్తావన తెస్తూ తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. ఆ మాటకొస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనే ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ ధనసిరి అనసూది ప్రత్యేక స్థానం. నక్సలైట్ ప్రస్థానం ముగించి జనజీవనం స్రవంతిలోకి వచ్చి అటునుంచి టీడీపీ ద్వారా రాజీకీయాల్లోకి అడుగుపెట్టిన సీతక్క అంటే రాజకీయాల్లో అందరికీ గౌరవమే. తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సైతం అసెంబ్లీలో సీతక్క గురించి చాలా హుందాగా మాట్లాడతారు. కాగా, రేవంత్ రెడ్డితో పాటు టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన సీతక్కకు ఆ పార్టీలోనూ అంతే ప్రాధాన్యం దక్కుతోంది. రేవంత్ సైతం ఆమెను ''సీతక్క''అంటూ చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పరిచయం చేసిన సందర్భంలోనూ సీతక్క గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.
ఇక మునుగోడు ఉప ఎన్నికలోనూ రేవంత్ సీతక్క ప్రస్తావన తెస్తున్నారు. ములుగులో సమ్మక్క (సీతక్క)ను గెలిపించారని.. మునుగోడులో సమ్మక్క (పాల్వాయి స్రవంతి)ని గెలిపించాలని కోరుతున్నారు. వీరిద్దరూ కలిసి అసెంబ్లీలో సమ్మక్క-సారక్కల తరహాలో ప్రజల సమస్యలపై పోరాటం సాగిస్తారని మునుగోడు ప్రజలకు చెబుతున్నారు. ఇది అక్కడి ఓటర్లకు బాగా కనెక్టవుతోంది. తెలంగాణలో సమ్మక్క-సారక్కలకు ఉన్న ఆరాధ్యనీయత అందరికీ తెలిసిందే. చాలామంది తమ ఇంటి దేవతలుగానూ వారిని కొలుస్తుంటారు. సరిగ్గా ఆపాయింట్ ను పట్టుకుని రేవంత్.. మునుగోడులో సమ్మక్క-సారక్కల ప్రస్తావన తెస్తున్నారు.