Begin typing your search above and press return to search.

ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన త‌ర్వాత కాంగ్రెస్ క‌న్నెర్ర చేసింది

By:  Tupaki Desk   |   24 Nov 2018 5:05 PM GMT
ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైన త‌ర్వాత కాంగ్రెస్ క‌న్నెర్ర చేసింది
X
తెలంగాణ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల్లో గెలుపుకోసం చెమ‌టోడుస్తున్న సంగ‌తి తెలిసిందే. గెలుపుకోసం కూట‌మి క‌ట్టి మ‌రీ బ‌రిలో దిగుతున్న కాంగ్రెస్ ఈ క్ర‌మంలో రెబెల్స్ విష‌యంలో సీరియ‌స్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఇప్ప‌టికే పార్టీ ముఖ్య‌నేత‌లు ప‌లువురు రెబెల్స్‌ ను బుజ్జ‌గించ‌గా...తాజాగా రెబెల్స్ విష‌యంలో క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై - మరికొందరు రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేసిన వారిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది... ఇవాళ సమావేశమైన టి.పీసీసీ క్రమశిక్షణా కమిటీ... 24 మంది నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన నేతలు...

1. రవి శ్రీనివాస్ (సిర్పూర్‌)
2. బోడ జనార్ధన్ (చెన్నూర్)
3. హరినాయక్ (ఖానాపూర్‌)
4. అనిల్ జాదవ్ (బోథ్‌)
5. నారాయణ్‌రావు పాటిల్ (ముధోల్)
6. అరుణ తార (జుక్కల్)
7. ఎన్. రత్నాకర్ (నిజామాబాద్ అర్బన్‌)
8. శ్రీ గణేష్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్)
9. కె. శివకుమార్ రెడ్డి (నారాయణపేట్‌)
10. ఇబ్రహీం (మహబూబ్‌నగర్‌)
11. సురేందర్ రెడ్డి (మహబూబ్‌నగర్‌)
12. బెల్లయ్య నాయక్ (దేవరకొండ)
13. పాల్వాయి శ్రవణ్‌ కుమార్ రెడ్డి (మునుగోడు)
14. డాక్టర్ రవి కుమార్ (తుంగతుర్తి)
15. మాలావత్ నెహ్రూ నాయక్ (డోర్నకల్‌)
16. అబ్బయ్య (ఇల్లందు)
17. బానోతు బాలాజీ నాయక్ (ఇల్లందు)
18. యడవల్లి కృష్ణ (కొత్తగూడెం)
19. రాములు నాయక్ (వైరా)
20. చిట్టెం అభిజయ్ రెడ్డి (నారాయణపేట)
21. కావలి నరహరి (ధన్వాడ మండల అధ్యక్షుడు)
22. సాయి రెడ్డి (నారాయణపేట)
23. నిరంజన్ రెడ్డి (నారాయణపేట)
24. సౌభాగ్య లక్ష్మీ (నారాయణపేట)