Begin typing your search above and press return to search.

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఆపటం వెనుకున్న లెక్కేంది?

By:  Tupaki Desk   |   13 March 2020 7:45 AM GMT
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఆపటం వెనుకున్న లెక్కేంది?
X
ఈ రోజు (శుక్రవారం) ఉదయం ట్రేడింగ్ మొదలైన వెంటనే.. సెన్సెక్స్ సూచీ దారుణంగా పడిపోయింది. కరోనా కారణంగా మార్కెట్ సెంటిమెంట్ పెద్ద ఎత్తున దెబ్బ తినటంతో కొనుగోళ్లు పెద్ద ఎత్తున చోటు చేసుకోవటంతో మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. గురువారం నాడు దాదాపు రూ.11 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరి అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ మొదలైన కాసేపటికే భారీ నష్టాలు చోటు చేసుకున్నాయి.

నిబంధనల ప్రకారం పది శాతం సర్య్కూట్ బ్రేక్ కావటంతో.. ట్రేడింగ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆపేసిన సెబీ.. తర్వాత పునరుద్దరించారు ఇలా ట్రేడింగ్ ను నిలిపివేయటం.. చాలా అరుదుగా జరుగుతుంది. కొన్నిసార్లు నిమిషాల వ్యవధిలోనే ఆపి.. తిరిగి ప్రారంభించినా.. తాజాగా మాత్రం నలభై ఐదు నిమిషాల పాటు ఆపేయటం గమనార్హం.

ఇంత ఎక్కువ సేపు ట్రేడింగ్ నిలిపివేసిన పరిస్థితి పన్నెండేళ్ల తర్వాత చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. సెబీ నిబంధన ప్రకారం సర్క్యూట్ పది శాతం కంటే ఎక్కువగా నష్టపోతున్న వెంటనే.. ట్రేడింగ్ కాసేపు ఆపి.. తిరిగి స్టార్ట్ చేస్తారు. ఇలా చేయటం ద్వారా నష్టాలు కొంతమేర తగ్గుతాయన్నది ఆలోచనగా చెబుతారు.

సెన్సెక్స్ 3వేల పాయింట్లు.. నిఫ్టీ 966 పాయింట్లు కోల్పోవటం.. లోయర్ సర్య్కూట్ ను టచ్ చేయటంతో ట్రేడింగ్ నిలిపివేశారు. తాజా పరిణామాలతో నిఫ్టీ మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరితే.. సెన్సెక్స్ పరిస్థితి ఇంచుమించు ఇదే పరిస్థితి. తాజా నష్టాలతోమరోసారి లక్షల కోట్ల రూపాయిల మదుపరుల సొమ్ము ఆవిరైంది. ఇదే పరిస్థితి కొనసాగితే.. పరిస్థితి దారుణంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.