Begin typing your search above and press return to search.
సీఎం క్యాన్వాయ్ కి ట్రాఫిక్ చలాన్లు !
By: Tupaki Desk | 3 Jun 2020 10:43 AM GMTచట్టానికి ఎవరు అతీతులుకారు. తప్పుచేస్తే .. ప్రజలైనా, నాయకులైనా ఒకటే. ఇలాంటి మాటలు నేతలు చెబుతుంటారు. కానీ అచరణలో మాత్రం కాస్త కష్టమే.. కానీ తెలంగాణ పోలీసులు మాత్రం రుజువు చేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి కాన్వాయ్ కు ఫైన్ చేశారు
ట్రాఫిక్ రూల్స్‌కు సీఎం కాన్వాయ్ కూడా అతీతం కాదని.. ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని పోలీసులు ప్రూవ్ చేశారు.
సీఎం కాన్వాయ్ పై ఓవర్ స్పీడ్ కు సంబంధించి మొత్తం నాలుగు ఫైన్లు విధించారు. హైదరాబాద్ లో రెండు, సైబరాబాద్ లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరో ఫైన్ విధించారు. గతేడాది అక్టోబర్ 16న కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో తొలిసారి ఫైన్ విధించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 15న మాదాపూర్ పరిధిలో రెండోది.. ఏప్రిల్ 29న టోలిచౌకి పరిధిలో మూడోది, జూన్ 1న ట్యాంక్ బండ్ పరిధిలో నాలుగో ఫైన్ విధించారు. దీంతో ప్రజలతో సీఎం కూడా సమానమేనని.. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరూ అతీతులు కారు అని తెలంగాణ పోలీసులు రుజువు చేశారు.
ఫైన్లకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మరింత ఆలస్యం చేయకూడదని సీఎంవో భావించింది. సీఎం కాన్వాయ్‌కు ఫైన్ పడిన విషయం మీడియాలో రావడంతో సీఎం కార్యాలయం వెంటనే స్పందించిది నాలుగు ఫైన్లకు సంబంధించి రూ.4 వేల 140 జరిమాన చెల్లించింది. తర్వాత ఈ చలానాలో చూసిన సీఎం కాన్వాయ్ మొత్తం చెల్లించారని, నో పెండిగ్ చూపిస్తోంది.