Begin typing your search above and press return to search.

అంబులెన్స్​కు దారిప్పించి హీరో అవగా..ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు

By:  Tupaki Desk   |   6 Nov 2020 2:30 PM GMT
అంబులెన్స్​కు దారిప్పించి హీరో అవగా..ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు
X
ట్రాఫిక్​లో చిక్కుకున్న అంబులెన్స్​కు దారి ఇప్పించి.. రోగి ప్రాణాలను కాపాడిన హైదరాబాద్​కు చెందిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​ బాబ్జీకి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. హైదరాబాద్​లోని అబిడ్స్​ వద్ద బాబ్జీ అంబులెన్స్​కు దారి ఇచ్చేందుకు వాహనాలను సుమారు రెండు కిలోమీటర్లు పరిగెత్తి వాహనాలను పక్కకు తప్పించి దారి ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమించాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సినీ ప్రముఖులు బాబ్జీపై ట్విట్టర్​, ఫేస్​బుక్​లో ప్రశంసలు గుప్పించారు.అయితే విధులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వెళ్ళిన బాబ్జికి ఊహించని వ్యక్తి నుంచి ప్రశంస లభించడంతో అతను ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.
తండ్రి వచ్చేంతవరకు మేల్కొని ఉన్న బాబ్జీ కూతురు కంగ్రాట్యులేషన్స్ డాడీ.. అంటూ ఓ లేఖ రాసివ్వగా.. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

బుధవారం సాయంత్రం బాబ్జీ అంబులెన్స్​కోసం ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు. ఇందుకోసం సుమారు 2 కిలోమీటర్లు పరిగెత్తి వాహనాలను పక్కకు తప్పించాడు. ఆ రోజు రాత్రి 11 గంటలకు బాబ్జీ విధులను ముగించుకొని ఇంటికి వెళ్లాడు. అప్పటివరకు మేల్కొని ఉన్న బాబ్జీ కూతురు శరణ్య ‘కంగ్రాట్స్​ డాడీ’ అంటూ ఓ పేపర్​ మీద రాసి తండ్రికి ఇచ్చింది. ప్రస్తుతం ఈ లెటర్​ సోషల్​మీడియాలో తెగ వైరల్​ అవుతున్నది. తనకు ఎన్ని ప్రశంసలు దక్కినా కూతురు ఇచ్చిన ప్రశంసలు మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని బాబ్జీ ఉద్వేగంతో పేర్కొన్నారు. ఎన్ని ప్రశంసలుదక్కాయి..అన్నదానికంటే తన వల్ల ఓ ప్రాణం నిలబడింది అంటే ఎంతో సంతోషం కలుగుతోందని బాబ్జీ చెప్పాడు.

హ్యాట్సాఫ్ బాబ్జీ

రోగిని కాపాడటం కోసం తపన పడ్డ ట్రాఫిక్​ కానిస్టేబుల్​ బాబ్జీని రాష్ట్ర మంత్రి హరీశ్​ రావు అభినందించారు. ‘బాబ్జీ కృషి అభినందనీయం. ట్రాఫిక్​ సిబ్బంది అంతా ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలి. పోలీస్​ డిపార్ట్​మెంట్​ గర్వపడే పనిచేశావు.. హ్యాట్సాఫ్ బాబ్జీ’ అంటూ హరీశ్​ ట్వీట్​ చేశాడు. ఈ విషయంపై బాబ్జీ స్పందిస్తూ.. ‘ నేను కేవలం నా డ్యూటీని చేశాను. సక్రమంగా విధులు నిర్వర్తించినందుకే నాకు ఈ ప్రశంసలు దక్కుతున్నాయి. ఓ రోగి ప్రాణం కాపడటాన్ని నేను గర్వంగా ఫీలవుతున్నాను’ అని బాబ్జీ పేర్కొన్నారు.