Begin typing your search above and press return to search.

రాష్ట్రప‌తి కాన్వాయ్ ఆపాడు.. శ‌భాష్ అన్నారు

By:  Tupaki Desk   |   20 Jun 2017 9:40 AM GMT
రాష్ట్రప‌తి కాన్వాయ్ ఆపాడు.. శ‌భాష్ అన్నారు
X
దేశానికే ప్రథ‌మ పౌరుడు. ఆయ‌న వ‌స్తున్నాడంటే ట్రాఫిక్ మొత్తం సెట్ చేసేస్తారు. గంట‌ల ముందు నుంచే ఆయ‌న వెళ్లే దారంతా ఒక ప‌ద్ధ‌తిలోకి తీసుకొచ్చేస్తారు. ఆంక్ష‌లు విధించి మ‌రీ ప్ర‌థ‌మ పౌరుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తారు. మ‌రి.. అలాంటి రాష్ట్రప‌తి కాన్వాయ్‌ ను ఎవ‌రైనా ఆపేస్తారా? అది సాధ్య‌మేనా? ఒక‌వేళ ఆపితే.. జ‌రిగే చ‌ర్య‌లు మామూలుగా ఉండ‌వు. కానీ.. తాజా ప‌రిణామంలో మాత్రం రాష్ట్రప‌తి కాన్వాయ్‌ ను ఆపేసిన ఒక ట్రాఫిక్ పోలీస్‌ ను శ‌భాష్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగింద‌న్న‌ది చూస్తే..

నాలుగు రోజుల క్రితం (శ‌నివారం) రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో ప‌ర్య‌టించారు. ట్రినిటీ స‌ర్కిల్ మీదుగా రాజ్ భ‌వ‌న్‌ కు ఆయ‌న వెళుతున్నారు. అయితే.. రాష్ట్రప‌తి కాన్వాయ్ వెళుతున్న నేప‌థ్యంలో ఒక అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. అక్క‌డే విధులు నిర్వ‌ర్తిస్తున్న నిజ‌లింగ‌ప్ప అనే ఎస్ఐ ఈ విష‌యాన్ని గుర్తించారు. ఆ అంబులెన్స్ లోని వారు త‌క్ష‌ణ‌మే ద‌గ్గ‌ర్లోని ప్రైవేటు ఆసుప‌త్రికి వెళ్లాల్సి ఉంది.

ఈ తీవ్ర‌త‌ను అర్థం చేసుకున్న స‌ద‌రు ఎస్ ఐ.. రాష్ట్రప‌తి కాన్వాయ్‌ ను ఆపేసి.. అంబులెన్స్ వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్ క్లియ‌ర్‌ చేశారు. అంబులెన్స్ వెళ్లిన త‌ర్వాత రాష్ట్రప‌తి కాన్వాయ్‌ ను పంపారు. ఎస్ ఐ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తూ బెంగ‌ళూరు ట్రాఫిక్ పోలీస్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ అభ‌య్ గోయ‌ల్ ట్విట్ట‌ర్లో ట్వీట్ చేశారు. దీంతో.. నిజ‌లింగ‌ప్ప ఉదంతం అంద‌రికి తెలిసిందే. ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. పెద్దఎత్తున ప్ర‌శంస‌ల్ని అందుకుంటున్నాడు. విధి నిర్వ‌హ‌ణ‌లో నిజ‌లింగ‌ప్ప ప్ర‌ద‌ర్శించిన ప‌నితీరును మెచ్చి ఉన్న‌తాధికారులు ఆయ‌న‌కు రివార్డు అంద‌జేయ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/