Begin typing your search above and press return to search.
పట్నం ప్యాక్ అయ్యింది..ట్రాఫిక్ జామ్ రిటర్న్స్!
By: Tupaki Desk | 28 Sep 2020 12:30 AM GMTకరోనా లాక్ డౌన్ తో వలసకూలీలు - చిరు ఉద్యోగులు హైదరాబాద్ విడిచిపెట్టి ఊర్లకు వెళ్లిపోవడంతో భాగ్యనగరం మొత్తం ఖాళీఅయ్యింది. ఎటుచూసినా జనాల రద్దీ లేక ట్రాఫిక్ జామ్ పూర్తిగా తగ్గింది. అయితే క్రమంగా వలసకూలీలు - చిరుద్యోగులు మళ్లీ ఉపాధి కోసం పట్నం బాటపట్టారు. దీంతో క్రమక్రమంగా హైదరాబాద్ మళ్లీ పూర్వకళను సంతరించుకుంది. శనివారం హైదరాబాద్ లో చాన్నాళ్ల తర్వాత మళ్లీ ట్రాఫిక్జామ్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ తరచూ అవుతోంది.
కరోనా లాక్ డౌన్ తో పలురంగాలు కుదేలయ్యాయి. టిఫిన్ సెంటర్ల యజమానులు - ఫుట్ పాత్ వ్యాపారులు - రోజుకూలీలు - నిర్మాణ రంగ కార్మికులు ఇలా బడుగు జీవులు - చిన్న పాటి ఉద్యోగులు దాదాపు 30 లక్షల మంది హైదరాబాద్ విడిచిపెట్టి తమ సొంత గ్రామాలకు వెళ్లారని విశ్లేషకులు అంచనా వేశారు. వారు వెళ్లిపోవడంతో హైదరాబాద్ నగరం బోసిపోయింది. ట్రాఫిక్ జామ్ తగ్గిపోయింది. బిజినెస్ కూడా డల్లయ్యింది. అయితే ప్రభుత్వాలు ప్రస్తుతం లాక్డౌన్ కు సడలింపులు విధించాయి. దీంతో మళ్లీ పలు కంపెనీలు తెరుచుకున్నాయి. దీంతో దినసరి కూలీలు - కార్మికులు - చిరు ఉద్యోగులు తిరిగి పట్నం బాటపట్టారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ లో మళ్లీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఓ వైపు వర్షం పడుతుండటంతో రోడ్లు చిత్తడిగా మారాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు అయిన ఎల్బీనగర్ - నాగోల్ - ఉప్పల్ - హబ్సీగూడ - ప్యాట్నీ సెంటర్ - బేగంపేట - పంజాగుట్ట - మైత్రీవనమ్ - యూసఫ్ గూడ సర్కిల్ - జూబ్లీ చెక్ పోస్ట్ - హైటెక్ సిటీ - ఖైరతాబాద్ - రవీంధ్ర భారతీ జంక్షన్ - నాంపల్లి - కోటి తదితర కూడళ్లలో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తోంది. నగరం విడిచిపెట్టి వెళ్లిపోయినవారంతా ఇప్పుడు తిరిగి హైదరాబాద్కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.