Begin typing your search above and press return to search.
రూ. 2 కోట్ల కారుకి రూ.27లక్షలు ఫైన్ ... ఎలా అంటే !
By: Tupaki Desk | 9 Jan 2020 8:02 AM GMTకొత్తగా దేశంలో కేంద్రం వాహన చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త వాహన చట్టం ప్రకారం ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సిందే. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పోలీసులు ఎన్ని సార్లు దీనిపై అవగాహనా కల్పిస్తున్నప్పటికీ కొందరు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. దీనితో రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగానే ఫైన్ విధించి వారికీ తగిన గుణపాఠం చెప్తున్నారు. తాజాగా ఓ కారు యజమానికి ఏకంగా రూ.27లక్షలు ఫైన్ వేశారు. కొత్త వాహన చట్టం వచ్చాక ఇంత భారీ ఫైన్ వేయడం ఇదే ఫస్ట్ టైం కావడం విశేషం.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఉంటున్న వ్యాపార వేత్త రంజిత్ దేశాయ్ కి 2 కోట్ల ఖరీదైన పోర్షే కారు ఉంది. కారు చాలా కాస్టలీ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వదిలేస్తారు లేని ఇష్టం వచ్చినట్టు కారు నడుపుతూ , ట్రాఫిక్ రూల్స్ ని లైట్ తీసుకున్నాడు. కానీ , ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడంతో ఆ వ్యక్తికి భారీ జరిమానా విధించారు. నంబర్ ప్లేట్, సరైన డాక్యుమెంట్స్ లేకుండా రోడ్డెక్కిన అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారు పోర్షే 911 పై 2019 నవంబర్ రూ. 9.80 లక్షల జరిమానా విధించారు. ఘటన జరిగిన 6 వారాల తర్వాత.. పెనాల్టీ విషయంలో పోలీసులు మరో అప్‌డేట్ ఇచ్చారు. ఫైన్‌ను గుజరాత్ ఆర్టీవో లేటెస్ట్ గా రూ.27.68 లక్షలకు పెంచారు.
ఫైన్ వేస్తే మరీ రూ.27.68 లక్షలు ఎలా అవుతుందని అని ఆలోచిస్తున్నారా. జనవరి 7, 2020 నుంచి 2033 ఆగస్టు 28 వరకు మోటార్ బ్యాలెన్స్ ట్యాక్స్ రూపంలో మోటార్ వెహికిల్ ట్యాక్స్ రూ.16 లక్షలు.. దానిపై వడ్డీ రూ.7.68 లక్షలు. పెనాల్టీ లేదా అదనపు ఫీజు రూపంలో మరో రూ.4 లక్షలు.. మొత్తం కలుపుకుంటే.. రూ.27.68 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. కారును దిగుమతి చేసుకున్నప్పటి నుంచి రోడ్ ట్యాక్స్ కట్టలేదు, రిజిస్ట్రేషన్ చేయించ లేదు. దీనితో భారీ ఫైన్ పడింది. పెండింగ్‌లో భారీ జరిమానా ఉండటంతో పోలీసులు పోర్షే కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అన్ని చలాన్లు కట్టి, వెహికల్ రిజిస్ట్రేషన్ ఇతర డాక్యుమెంట్లు చూపించాకే కారును తీసుకెళ్లాల్సిందిగా ట్రాఫిక్ డీసీపీ అజిత్ రాజన్ చెప్పారు. ఇక చేసేదేమి లేక పోలీసులు చెప్పినట్టు అన్ని చేసి , మొత్తం ఫైన్ ని ఆర్టీవో ఆఫీస్ లో చెల్లించి తన కారుని పోలిసుల నుండి తీసుకోని వెళ్ళాడు.