Begin typing your search above and press return to search.

పెండింగ్ చలాన్లు కట్టలేదా? వాహనదారులకు భారీ షాక్

By:  Tupaki Desk   |   22 Sep 2022 12:30 PM GMT
పెండింగ్ చలాన్లు కట్టలేదా? వాహనదారులకు భారీ షాక్
X
రోడ్డెక్కాలంటే ఫైన్ల మోత మోగిపోయేలా చేస్తున్నారు పోలీసులు.. హెల్మెట్ సరిగా పెట్టుకోకున్నా.. బండి కాస్త అడ్డదిడ్డంగా నడిపినా.. ఏ సందులోంచి వచ్చినా.. బొందులోకి వెళ్లినా.. ఏదో ఒక ఫైన్ పేరిట చలాన్లు ఇంటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ వాహనదారులకు మరో భారీ షాకిచ్చారు పోలీసులు..

పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ.. పెండింగ్ చలాన్లు సకాలంలో కట్టని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. రెండింతల ఫైన్లు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. మూడు నెలల వ్యవధిలో జరిమానాలు సరిగ్గా చెల్లించుకుండా.. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై మోటార్ వాహనాల చట్టంలోని కీలక సెక్షన్లను ప్రయోగించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు వారు చేసిన ట్రాఫిక్ వైలేషన్స్ కు డబుల్ జరిమానాలు విధించనున్నారు.

హెల్మెట్ లేకుండా ప్రయాణం.. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ తదితర ఉల్లంఘనలకు ఈ విధానం వర్తించనుందని తెలిపారు. దీనికి సంబంధించి నగర ట్రాఫిక్ విభాగంగా ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు ప్రారంభించినట్టు తెలిపారు.

మూడు నెలల్లో ఫైన్ చెల్లించకుండా మరో ఉల్లంఘనకు పాల్పడితే దాన్ని రెండింతలు చేస్తారు.

-హెల్మెట్ లేకుండా మొదటి సారి ప్రయాణిస్తే రూ.100, రెండోసారి రూ.200, మూడోసారికి రూ.600 ఫైన్ విధిస్తారు.

-రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే ఆటోలకు రూ.200, రెండోసారి రూ.600, మూడోసారి 800 ఫైన్ వేస్తారు.

-అక్రమ పార్కింగ్ చేస్తే టీవీలర్ కు రూ.200, రూ.700, రూ.1000 చొప్పున ఫైన్ వేస్తారు. భారీ వాహనాలకు రూ.1000, 1200, 1700 చొప్పున జరిమానా విధిస్తారు.

తీవ్రంగా అధ్యయనం చేసిన తర్వాతనే పోలీసులు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పటిదాకా మోటారు వాహనాల చట్టంలో వినియోగించని పలు కీలక సెక్షన్లను అమలులోకి తీసుకురానున్నారు. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడం.. రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగంగా ఈ విధానాన్ని వాడుకలో తీసుకురావాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.