Begin typing your search above and press return to search.
పెరుగుతున్న విమాన ప్రయాణీకుల సంఖ్య
By: Tupaki Desk | 30 Oct 2020 4:10 PM GMTవిమానాల్లో ప్రయాణించే ప్రయాణీకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం లాక్ డౌన్ లో ఉండిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మనదేశంలో కూడా లాక్ డౌన్ ప్రభావం చాలా ఎక్కువగానే పడింది. మిగిలిన రంగాలకు లాగానే విమానరంగంపైన కూడా దెబ్బపడింది. దాదాపు మూడు నెలల పాటు దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.
అయితే మెల్లిగా అనలాక్ ప్రక్రియ మొదలైన తర్వాత మిగిలిన రంగాల్లో లాగే విమానరంగంలో కూడా వెసులుబాట్లు వచ్చాయి. అన్ లాక్ 5.0లో భాగంగా మరిన్ని వెసులుబాట్లు రావటంతో శాంషాబాద్ విమానాశ్రయం నుండి ట్రాఫిక్ మెల్లగా పుంజుకున్నది. మొన్నటి మే 25వ తేదీ నుండి ఇప్పటివరకు 12 లక్షలమంది విమానాల్లో ప్రయాణించారు. మే 25వ తేదీన దేశీయ విమానాలు తిరగటానికి వెసులుబాటు కల్పించింది కేంద్రప్రభుత్వం. అప్పటి నుండి కొన్నివారాల పాటు శంషాబద్ నుండి రోజుకు 3 వేల మంది ప్రయాణీకులు మాత్రమే విమానాలు ఎక్కారు.
అలాంటిది ఇపుడు రోజుకు 20 వేలమంది ప్రయాణీకులు విమానాల్లో ఎక్కేంతగా ట్రాఫిక్ పుంజుకుంది. కోవిడ్ సమస్యకు ముందు రోజుకు 55 వేలమంది విమానాలు ఎక్కేవారు. అన్ లాక్ తొలిరోజుల్లో రోజుకు 40 విమాన సర్వీసులు నడిస్తే మెల్లిగా ఈ సంఖ్య రోజుకు 230 విమానాలకు పెరిగింది. శంషాబాద్ నుండి ఎక్కువగా ఢిల్లీ, చెన్నై, ముంబాయ్, బెంగుళూరు, కోల్ కత్తాకు ఎక్కువగా విమానాలు ఎగురుతున్నాయి. మొదట్లో హైదరాబాద్ నుండి వెళ్ళే వారే ఉండేవారు. కానీ మెల్లిగా పై రాష్ట్రాల నుండి కూడా హైదరాబాద్ కు వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇక ఏపి విషయానికి వస్తే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నుండి కూడా విమాన రాకపోకల సర్వీసులు పెరుగుతున్నాయి. పై ప్రాంతాల నుండి ఎక్కువగా ఢిల్లీ, చెన్నై కు ఎక్కువగా విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య పెరుగోతోంది. అదే సందర్భంలో పై నగరాల నుండి తిరుపతికి ఎక్కువగా ప్రయాణీకులు రాకపోకలు సాగుతున్నాయి. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతున్న కారణంతోనే విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.