Begin typing your search above and press return to search.
అమెరికాలో కొత్త జంటను వెంటాడిన ప్రమాదం.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం
By: Tupaki Desk | 2 Dec 2022 4:27 AM GMTఅమెరికాలో భారతీయులకు ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవలే ఒక భారతీయ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. అది మరవకముందే ఇద్దరు తెలుగు విద్యార్థులు సరస్సులో పడి మృతిచెందారు. ఇప్పుడు ఈ విషాదాలు మరువకముందే మరో భారతీయ కొత్తగా పెళ్లయిన జంటకు విషాదం నెలకొంది.
సుదీప్ శ్రీనివాస్( 30), గౌరీ( 24) ఫ్లోరిడాలో సెలవుదినం కోసం బయటకు విహారానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఘోర ప్రమాదం జరిగింది. హెఫ్లిన్ సమీపంలో ఐ20 వెస్ట్‌లో వారి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంటకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం కారణంగా సుదీప్ మరణించగా.. గౌరీ బర్మింగ్‌హామ్ ఏఎల్ లో శస్త్రచికిత్సలు చేయించుకుంటూ ప్రాణాలతో పోరాడుతోంది. సుదీప్‌ను కోల్పోయిన వారి కుటుంబాలు షాక్‌లో ఉన్నాయి. గౌరీ పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతానికి గౌరి పరిస్థితి విషమంగా ఉందని.. మరో మూడు నెలలు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆమె హెచ్ 4 వీసాపై అమెరికా వచ్చారని.. నిరుద్యోగి అని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి ఛార్జీలు భారీగానే వేసినట్టు తెలిసింది.
నవ జంటకు ప్రమాదంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. సుదీప్ అంత్యక్రియల కోసం సుదీప్‌ను తిరిగి భారతదేశానికి తరలించే బాధ్యతను నిర్వహించలేకపోతున్నాయి.
సుదీప్ ఎంతో స్నేహపూర్వక ప్రేమగల వ్యక్తి అతడి సన్నిహితులు చెబుతున్నారు. అతను అనేక గొప్ప పనుల కోసం నిధులను సేకరించడంలో సహాయం చేశాడు. సుదీప్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి.. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం తక్షణ ఖర్చులను తీర్చడానికి ప్రస్తుతం నిధుల సేకరణ జరుగుతోంది. తానా సహా ఇతర సభ్యులు ఆదుకోవాలని పలువురు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.