Begin typing your search above and press return to search.

నిజాం ఫ్యామిలీకో విషాదం.. టర్కీలో మరణించిన అతడి చివరి కోరిక తెలుసా?

By:  Tupaki Desk   |   16 Jan 2023 11:30 AM GMT
నిజాం ఫ్యామిలీకో విషాదం.. టర్కీలో మరణించిన అతడి చివరి కోరిక తెలుసా?
X
హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన నిజాం కుటుంబంలో తాజాగా విషాదం నెలకొంది. ఎనిమిదో నిజాం రాజు ముకర్రం జా బహదూర్ గా పిలిచే మీర్ బర్కెట్ అలీఖాన్ ఇక లేరు. 89 ఏళ్ల వయసున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా నిజాం కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బతికినంత కాలం టర్కీలోనే బతికేసిన ఆయన్ను ఇప్పుడు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో నివసించిన ఆయన.. అనారోగ్య కారణంగా మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన చివరి కోరిక బయటకు వచ్చింది. తాను మరణించిన తర్వాత తనను హైదరాబాద్ లోనే అంత్యక్రియలు చేపట్టాలని కోరినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు (జనవరి 17న) హైదరాబాద్ కు ముకర్రం జా భౌతికకాయాన్ని తీసుకురానున్నారు.

తొలుత ఆయన్ను హైదరాబాద్ లోని చౌమహల్లా ప్యాలెస్ లో ఉంచి.. ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం మత ఆచారాల ప్రకారం ఆయన్ను.. అసఫ్ జాహీ కుటుంబ సమాధుల వద్ద అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

"హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబ్ మీర్ బర్కెట్ అలీఖాన్ వాలాషన్ ముకర్రం జా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్ లో శనివారం రాత్రి 10.30 గంటల వేళలోప్రశాంతంగా మరణించిన విషయాన్ని మీకు తెలియజేయటానికి మేం చాలా బాధపడుతున్నాం" అంటూ ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన జారీ చేశారు. ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్ లో అంతిమ సంస్కారాలు జరపనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.