Begin typing your search above and press return to search.
రాజమండ్రి: పుష్కరాల్లో ఘోర విషాదం
By: Tupaki Desk | 14 July 2015 4:30 AM GMTగోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించి చరిత్రలో లిఖిద్దామని భావించిన చంద్రబాబు ప్రభుత్వానికి మొదటి రోజునే పెద్ద షాక్ తగిలింది. పుష్కర ఘాట్లలో విపరీతమైన రద్దీ కారణంగా కోటగుమ్మం పుష్కర ఘాట్లో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు కొంతసేపటికి చనిపోయారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అనూహ్య సంఖ్యలో భక్తులు తరలిరావడంతో భద్రత ఏర్పాట్లు సరిపోలేదు.
చనిపోయిన వారి శవాలు అరగంట వరకు తరలించలేకపోయారంటే అక్కడ ఎంత రద్దీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎంత రద్దీ ఉన్నా ప్రాణాలు పోయే పరిస్థితి రావడం మాత్రమే ప్రభుత్వ భద్రతా వైఫల్యమే అని విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. వెంటనే కంట్రోల్ రూంకి వెళ్లి అక్కడి నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒకే ఘాట్ కు ఎక్కువ మంది రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే.. రాజమండ్రిలోని 17 పుష్కర ఘాట్లలో ఇసకేస్తే రాలనంత రద్దీ ఉంది. ఎక్కడా ఇంచు స్థలం ఖాళీ లేదు.