Begin typing your search above and press return to search.
సినిమా ఫక్కీలో బుద్ధుడి విగ్రహం విక్రయం.. కానీ సీన్ రివర్స్!
By: Tupaki Desk | 21 Dec 2021 5:54 AM GMTపంచలోహ విగ్రహాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు వారు. అందులో వచ్చిన లాభాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేసి... పక్క రాష్ట్రంలో చర్చలు జరుపుతున్నారు. అంతలోనే పోలీసులకు చిక్కారు. ఇంకేం... వారి ప్లాన్ అంతా రివర్స్ అయింది. విగ్రహం సహా, నగదు, సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. స్వామిరారా సినిమా రేంజ్ లో జరిగిన ఈ విగ్రహం ఎక్కడిదంటే..!
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన మిట్టపల్లి వేణుగోపాల్ అనే వ్యక్తి... గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద దగ్గర ఓ పురాతన బుద్ధుడి విగ్రహాన్ని కొనుగోలు చేసినట్లు సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ పంచలోహ విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని భావించి... గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి రూ.5లక్షలకు కొన్నట్లు వెల్లడించారు.
ఈ పురాతన బుద్ధ విగ్రహంతో అంతా శుభం జరుగుతుందని, ఆర్థికంగా బాగా కలిసివస్తుందని నమ్మినట్లు... కానీ ఏం ప్రయోజనం కనిపించలేదని ఎస్పీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ విగ్రహాన్ని ఇతరులకు విక్రయించాలని వారు ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు.
ఆ విగ్రహాన్ని అమ్మకానికి ఏపీకి చెందిన వెంకట నరసింహా రావు, పురుషోత్తం, నవీన్ బాబు, భాను ప్రకాశ్ అనే నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి... గత మూడు నెలలుగా ప్లాన్ చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఆ విగ్రహాన్ని కొనడానికి యానిస్ అనే వ్యక్తికి చెందిన ముఠా ముందుకు వచ్చిందని వెల్లడించారు.
దీనిని రూ.2 కోట్లకు విక్రయించాలని ఆలోచనతో... రూ.కోటికి ఆ పురాతన బుద్ధుని ప్రతిమను కొనుగోలు చేయాలనుకున్నారని చెప్పారు. అయితే ఈ వ్యవహారం ఏపీలో జరిగితే... పోలీసులకు అనుమానం వస్తుందని భావించారని అన్నారు. అందుకే పక్క రాష్ట్రంలో ప్లాన్ చేశారని పేర్కొన్నారు. కాగా సీన్ రివర్స్ అయింది.
రెండు ముఠాలకు చెందిన సభ్యులు... తెలంగాణలోని సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో చర్చలు జరుపుతుండగా తమకు సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసుల సాయంతో... తనిఖీలు చేయగా ఈ అంతర్రాష్ట్ర ముఠాలు దొరికాయని వెల్లడించారు.
ఇరు ముఠాలకు చెందిన 11 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా నిందితుల వద్ద ఉన్న 26 కిలోల పంచలోహ పురాతన బుద్ధుడి విగ్రహం, రూ.30 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లు, ఇన్నోవో కారు, డబ్బులు లెక్కించే యంత్రం, వేయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ వివరాలను ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆయన కార్యాలయంలో వెల్లడించారు. అంతర్రాష్ట్ర ముఠాల కుట్రను భగ్నం చేసి... నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన పోలీసులను అభినందించారు. పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు.