Begin typing your search above and press return to search.

సిఐడి ఆఫీసర్ అంటూ లైంగిక వేధింపులు.. వాట్సాప్ లో బూతు ఫోటోలు

By:  Tupaki Desk   |   13 Nov 2021 12:30 AM GMT
సిఐడి ఆఫీసర్ అంటూ లైంగిక వేధింపులు.. వాట్సాప్ లో బూతు ఫోటోలు
X
భారతదేశంలో మహిళలపై వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. మానవ మృగాలు ఏదో ఒక రూపంలో వారిపై జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు. మహిళల భయాన్ని అదునుగా చేసుకొని వారిని లొంగ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో వాట్సప్ , ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. బలవంత పెట్టి వారితో కోరికను తీర్చుకునేందుకు చూస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాదులోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. అయితే నిందితుడు తాను ఒక ఉన్నత స్థాయి అధికారి అని చెప్పి మహిళలు తీవ్రంగా వేధించాడు.

అసభ్యకరమైన పదజాలంతో వాట్సాప్ లో మెసేజ్ లు పంపించాడు. వాటికి మహిళ స్పందించకపోవడంతో సరాసరి వీడియో కాల్ చేయడం ప్రారంభించాడు. దీంతో ఏమి చేయలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. తనకు ఒక నెంబర్ నుంచి అసభ్యకర మెసేజ్ లు వస్తున్నాయని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అసలు ఏం జరిగింది అంటే.. అక్టోబర్ 29వ తేదీన తనకు ఒక కొత్త నెంబర్ నుంచి వాట్సాప్ లో హాయ్ అనే మెసేజ్ వచ్చినట్లు బాధితురాలు పేర్కొంది. తరువాత మెసేజ్ లో ఓ వ్యక్తి తనను తాను సిఐడి ఆఫీసర్ గా పరిచయం చేస్తున్నట్లు తెలిపింది. మహిళను ఓ వేడుకలో చూసినట్లు మెసేజ్ చేశాడు . తనకు బాగా నచ్చినట్లు చెప్పాడు. ఇందుకుగాను తనతో ఏకాంతంగా గడపాలని అసభ్యకరమైన మెసేజ్ లను పంపించ సాగాడు. వీటితో పాటు మహిళా చెప్పుకోలేని కొన్ని దారుణమైన ఫోటోలను, వీడియోలను వాట్సాప్ లో పంపినట్లు పోలీసులకు వివరించింది ఆ మహిళ. అయితే తనకు పంపిన మెసేజ్ లను ఆమె చూసినట్లు తెలియగానే వాటిని డిలీట్ ఫర్ ఎవరీ వన్ గా కొట్టి డిలీట్ చేసినట్లు వివరించింది.

ఆ వ్యక్తి పంపించే మెసేజ్ లకు సహనం కోల్పోయిన మహిళ చివరకు నువ్వెవరో చెప్పాలంటూ వచ్చిన మెసేజ్ లకు రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే తాను సిఐడి లో పని చేస్తున్నానని నిందితుడు చెప్పాడు. ఉన్నత స్థాయి ఉద్యోగినని పేర్కొన్నాడు. అనంతరం అతనికి సంబంధించిన మరికొన్ని వివరాలను ఆమెతో షేర్ చేసుకున్నాడు. చివరగా ఆమె అంటే ఇష్టం అని చెప్పి.. ఇందుకుగానూ తనతో ఏకాంతంగా గడపాలని కోరాడు. ఆ మాటలు విన్న ఆమె ఆ నెంబర్ ను బ్లాక్ చేసింది.

ఇంతటితో వదలకుండా ఆ వ్యక్తి యూనిఫాం వేసుకుని మహిళకు తిరిగి ఇంకో నెంబర్ తో వీడియో కాల్ చేశాడు. ఎవరో అని కాల్ లిఫ్ట్ చేసిన మహిళ.. యూనిఫాంలో ఉన్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా భయపడింది. అయితే ఈ విషయంపై ఏం చేయాలో తెలియక చివరకు రాచకొండ కమిషనరేట్ లో సైబర్ విభాగానికి తన గోడు వెళ్లబోసుకున్న ది. మహిళ చెప్పిన దాని ప్రకారం వేధింపుల కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.