Begin typing your search above and press return to search.

జీజీహెచ్‌లో దారుణం: ఈసీజీ కోసం వచ్చిన యువతి బట్టలు విప్పి..!

By:  Tupaki Desk   |   13 Nov 2021 8:53 AM GMT
జీజీహెచ్‌లో దారుణం: ఈసీజీ కోసం వచ్చిన యువతి బట్టలు విప్పి..!
X
ఆసుపత్రి అనేది అన్ని మతాలు , కులాల వారికి దేవాలయం. ఒక్కొక్కరికి ఒక్కో దేవాలయం ఉంటుంది కానీ ఆరోగ్యం బాగాలేకపోతే అందరూ వచ్చే ఏకైక దేవాలయం ఆస్పత్రి. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వాస్పత్రిలో గుంటూరు (Guntur) జీజీహెచ్ కు ప్రత్యేక స్థానముంది. నిత్యం వేలాది మంది రోగులు ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. వైద్య సపాదాయాల మాట అటుంచితే... నిత్యం వివాదాలకు ఈ ఆస్పత్రి కేంద్ర బిందువవుతోంది. ఈసీజీ కోసం వచ్చిన ఓ యువతి పట్ల టెక్నీషయన్ అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.

తాజాగా పాత గుంటూరుకు చెందిన ఓ యువతికి ఛాతీలో నొప్పిరావడంతో తల్లిదండ్రులు జీజీహెచ్ కు తీసుకెళ్లారు. డాక్టర్ సూచన మేరకు ఈసీజీ తీయించేందుకు ల్యాబ్ కు వెళ్లారు. అక్కడ టెక్నీషియన్ గా హరీష్ అనే యువకుడు ఉన్నాడు.

యువతి తల్లిదండ్రులను బయటకుపంపిన హరీష్, ఈసీజీ తీయాలంటే దుస్తులు విప్పాలని యువతికి సూచించాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దుస్తులు తీయకుంటే రిపోర్ట్స్ సరిగా రావని ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని గట్టిగా అరవడం త చేసేది లేక ఆమె దుస్తులు విప్పింది. యువతి సిగ్గుతో కళ్లు మూసుకోగా.. బల్లపై పడుకోమని చెప్పి ముబైల్ లో ఫోటోలు తీశాడు. ఇంతలో కళ్లు తెరిచిన బాధితురాలు ఒక్కసారిగా కేకల వేస్తూ దుస్తులు వేసుకొని బయటకు వెళ్లింది.

లోపల జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పడంతో హరీష్ ను నిలదీశాడు. అంత జరిగినా కూడా తాను ఏ తప్పూ చేయలేదని బుకాయించాడు. దీంతో బాధితురాలి తండ్రి జీజీహెచ్ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి.

అసలు హరీష్ ఈసీజీ టెక్నీషియన్ కాదని, సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈసీజీ స్పెషలిస్ట్ శంకర్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడి స్థానంలో ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థికి బాధ్యతలు అప్పజెప్పారు. ఐతే అతడు కూడా విధుల్లోకి రాకపోగా హరీష్ ను తీసుకొచ్చి ఈసీజీ తీయిస్తున్నాడు.

హరీష్ ఈ యువతి పట్లేనా లేక ఇంకా ఎవరితోనైనా ఇలా ప్రవర్తించాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజా ఘటన జీజీహెచ్ లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందనడానికి నిదర్శనంగా మారింది. ఇటీవలే ఓ పసికందును ఆస్పత్రిలో పనిచేసేవాళ్లే కిడ్నాప్ చేశారు. తాజాగా యువతి పట్ల అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. ఐతే ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని కిందిస్థాయి ఉద్యోగులంటున్నారు.