Begin typing your search above and press return to search.

ఆధార్ భద్రతపై సీఈఓ సవాల్..మైండ్ బ్లాంకయ్యే రిప్లై

By:  Tupaki Desk   |   29 July 2018 1:58 PM GMT
ఆధార్ భద్రతపై సీఈఓ సవాల్..మైండ్ బ్లాంకయ్యే రిప్లై
X
ఆధార్ విషయంలో సాగుతున్న చర్చోపచర్చల వాదాల యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది. ఏకంగా టెలికాం రెగ్యులేటరీఅథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ ఆర్ ఎస్ శర్మ ఎంటరవగా…ఆయనకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ``ఇదీ నాఆధార్ నంబర్.. దమ్ముంటే నా వివరాలు చెప్పండి!`` అంటూ ఆయన సవాల్ విసరగా…ఆయనకు సంబంధించిన కీలక అంశాలను పలువురు తెరమీదకు తీసుకువవచ్చారు. దీంతో..ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అయింది.

ట్రాయ్ చైర్మన్ శర్మ ``కేవలం ఆధార్ నంబర్ తెలిసినంత మాత్రాన వ్యక్తిగత వివరాలు ఎలా బయటకు వస్తాయి? అంటూ ఆయనతన ట్విటర్ అకౌంట్‌ లో తన ఆధార్ నంబర్‌ను ట్వీట్ చేసి సవాలు విసిరారు. ``నేను నా ఆధార్ నంబర్ ఇస్తున్నారు. మీకో చాలెంజ్. దీని ద్వారా నాకు వచ్చిన ముప్పేంటో చెప్పండి`` అంటూ ట్రాయ్ చైర్మన్ ట్వీట్ చేశారు. వెంటనే ఆయనకు సంబంధించిన ఫోన్నంబర్ - ఇంటి అడ్రెస్ - డేట్ ఆఫ్ బర్త్ - ఫొటోలు - పాన్ కార్డు వివరాలన్నీ యూజర్లు ట్వీట్ చేయడంతో షాక్ తిన్నారు. ఇలాంటి సవాలు విసిరితే నీకే నష్టమంటూ మరికొందరు యూజర్లు శర్మపై తీవ్రంగా మండిపడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆయన సవాలుకు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు.

శర్మకు సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే బయటకుతెలిసినా.. ఆయనకు సంబంధించిన పాన్ కార్డు వివరాలు కరెక్టేనాఅన్న విషయం మాత్రం బయటకు రాలేదు. దీనిపై స్పందించడానికి శర్మ నిరాకరించారు.ఈ సవాలు మరికొంత సమయం నడవనీ అని ఆయన పీటీఐతో అన్నారు. ఈ వివరాలేమీ దేశానికిసంబంధించిన రహస్యాలేవీ కావు కదా అని శర్మ అన్నారు. ఆధార్ నంబర్‌ను బయటకు ఎందుకు చెప్పకూడదో మీకు ఇప్పటికైనా అర్థమైందని అనుకుంటా అని ఇలియాట్ ఆల్డర్సన్ అనే ఓ ఫ్రెంచ్ సెక్యూరిటీ ఎక్స్‌ పర్ట్ ట్వీట్ చేశాడు. తాను ఫోన్ నంబర్లు - మిగతా వివరాలు బయట పెట్టాలని సవాలు చేయలేదని - తనకు ఏవిధంగా హాని కలుగుతుందో చెప్పాలని అడిగానని శర్మ చెప్పారు.