Begin typing your search above and press return to search.

కాల్ డ్రాప్స్ లో మొనగాడు కంపెనీ ఇదేనా?

By:  Tupaki Desk   |   23 July 2015 7:03 AM GMT
కాల్ డ్రాప్స్ లో మొనగాడు కంపెనీ ఇదేనా?
X
అరచేతిలో సాంకేతిక విప్లవం సృష్టించిన ఘనత సెల్ ఫోన్ దే. ఈ రోజు మనిషికి తప్పనిసరిగా కావాల్సిన ఐదు వస్తువులని ఎవరికైనా చాయిస్ ఇస్తే.. అందులో ప్రతి ఒక్కరూ డేటా కలిగున్న ఫోన్ ని అడగటం ఖాయం.

చేతిలో ఫోన్ ఉన్నా.. కాల్ డ్రాప్ సమస్య చాలామంది ఎదుర్కొంటుంటరు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు.. హటాత్తుగా ఫోన్ కాల్ కట్ అయపోవటం.. చిరాకు తెప్పిస్తాయి. ఇక.. ఏదైనా ముఖ్యమూన కాల్ మధ్యలో కట్ అయతే.. ఆ మంటే వేరుగా ఉంటుంది. అలా తరచూ వినియోగదారులు తాము పడే కష్టాల్ని సదరు కంపెనీకి కోరతే. మరికొందరు టెలికం కంపెనీలకు ఫిర్యాదు చేస్తూ ముకుతాడు వేసే ప్రయత్నం చేస్తారు.

ఇటీవల కాలంలో కాల్ డ్రాపింగ్ క సంబంధింరి ట్రాయ్ దృష్టి పెట్టింది. తాజా నివేదికలోని అలాంటి కంపెనీల భాగోతాలను బయటకు తీసింది. అత్యధికంగా కాల్ డ్రాపింగ్ చేస్తున్న కంపెనీగా ప్రముఖ టెలికం కంపెనీ ఎయిర్ టెల్ అని చెప్పింది. తర్వాత స్థానాల్లో వోడాఫోన్.. ఐడియా.. బీఎన్ ఎన్ లు నిలిచాయి. మొత్తానికి కాల్ డ్రాప్స్ విషయంలో ప్రజల ఆసక్తిని అర్థం చేసుకొని సమాచారం బయటకు రావటం మంచి పరిణామమే.