Begin typing your search above and press return to search.
మీ సెల్ నెంబరు 11 అంకెలకు ఎందుకు మారిపోనుంది?
By: Tupaki Desk | 30 May 2020 4:15 AM GMTమీరు చదివింది నిజమే. రానున్న రోజుల్లో సెల్ నెంబరు పదకొండు అంకెలకు వెళ్లనుంది. ఇప్పటివరకున్న పది అంకెల స్థానం నుంచి పదకొండు నెంబర్లకు చేరనుంది. ఎందుకిలా అంటే?.. ఇప్పుడున్న పది అంకెలతో కూడిన నెంబర్లు పూర్తి కావటం.. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మొబైల్ నెంబర్ల వినియోగం పెరిగే నేపథ్యంలో.. అంకెల సంఖ్యను పెంచాలన్న ఆలోచనలో ట్రాయ్ (భారత టెలికం రెగ్యులేటరీ ప్రాధికార సంస్థ) ఉంది. దీనికి సంబంధించిన తాజాగా కేంద్రానికి ఒక సిఫార్సు చేసింది.
ఒక అంకెను అదనంగా చేర్చటం ద్వారా వెయ్యి కోట్ల నెంబర్లు అందుబాటులోకి వస్తాయి. రానున్న అవసరాలను తీర్చటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు.. భవిష్యత్తులో అంకెల్ని పెంచాల్సిన అవసరం రాకుండా ఉండేందుకు మరిన్ని నిర్ణయాల్ని తీసుకోనున్నారు. ల్యాండ్ నుంచి మొబైల్ కు ఫోన్ చేసేటప్పుడు సున్నా నొక్కటం తప్పనిసరి చేయనున్నారు.
అంతేకాదు.. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ సేవలు మరింత ఎక్కువగా అవసరమైన నేపథ్యంలో.. డాంగిల్స్ కు ప్రస్తుతం ఇస్తున్న పది నెంబర్ల స్థానంలో పదమూడు నెంబర్లను ఉపయోగించాలన్న ఆలోచనను కేంద్రం ముందు ఉంచింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒకవేళ ట్రాయ్ చెప్పినట్లే కేంద్రం పది నెంబర్లు ఉన్న ఫోన్ నెంబర్ ను పదకొండుకు మారిస్తే.. ప్రతి ఒక్కరి సెల్ పోన్ లో ఉండే వందలాది నెంబర్లు ఆటోమేటిక్ గా పదకొండు అంకెల్లోకి మార్చటం ఎలా అన్నది సమస్యగా మారనుంది. ఆటోమేటిక్ ప్రోగ్రాం ద్వారా.. ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉన్న నెంబర్లకు పదకొండో నెంబరుగా ‘‘9’’ అంకె ముందుకు చేరేలా ప్రోగ్రాం చేస్తే చాలావరకు తిప్పలు తప్పుతాయి. లేదంటే.. ప్రతి ఫోన్ లో ఉండే పది అంకెల్ని పదకొండు అంకెలకు మార్చుకోవటం తల ప్రాణం తోకకు రావటం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి.