Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ చెప్పిన ట్రాయ్ .. ఆ కనెక్షన్ తీసుకుంటే నెలకి రూ 200 ఫ్రీ !
By: Tupaki Desk | 23 May 2021 1:30 AM GMTగత కొన్ని నెలలుగా కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. మొదటి వేవ్ కంటే సెకెండ్ వేవ్ లో భారత్ లో విజృంభణ ఎక్కువగా ఉంటుంది. తొలిసారి సుదీర్ఘకాలం పాటు సాగిన లాక్ డౌన్ తరహా పరిస్థితులు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అడ్డుకోగలిగినప్పటికీ, సెకెండ్ వేవ్ రాకుండా అడ్డుకోలేకపోయారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లాక్ డౌన్ విధించకపోవడం దీనికి ఓ కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు తలకిందలవుతాయనే కారణంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. గత ఏడాదిన్నర కాలంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా..దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. న్యాయస్థానాలు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజువారీ విచారణలను నిర్వహిస్తోన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఇదే విధానాన్ని అనుసరిస్తోన్నాయి.
అయితే , ఈ తరహా పరిస్థితులు ఇంకా ఎన్నిరోజులు ఉంటాయో తెలియదు. ఎన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొనసాగుతుందనేది కరెక్ట్ గా ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ పరిణామాల మధ్య ల్యాండ్ లైన్ కనెక్షన్లను పెంచుకోవడంపై ట్రాయ్ దృష్టి సారించింది. ల్యాండ్ లైన్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లకు ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంది. ల్యాండ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న వారికి నేరుగా ప్రతినెలా 200 రూపాయల ప్రోత్సాహం అందేలా ఏర్పాటు చేయడంపై దృష్టి సారించింది. ల్యాండ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ దారులకు నేరుగా బెనిఫిట్ కలిగేలా దీనిపై కీలక చర్యలకి సిద్ధం అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లపై ఒత్తిడి అధికమైంది. రోజూ వేలాది జీబీల డేటా వినియోగమౌతోంది. ఫలితంగా వాటి సర్వర్ల మీద భారం పడుతోంది. దీన్ని నివారించడానికి ల్యాండ్ లైన్ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లను ప్రోత్సహించాలని ట్రాయ్ నిర్ణయించింది.
దేశంలో 75 కోట్లకు పైగా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 73 కోట్లకు పైగా కనెక్షన్లు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల మీదే ఆధారపడి ఉన్నాయి. ఇందులో ల్యాండ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ వాటా చాలా తక్కువ. 2.26 కనెక్షన్లు మాత్రమే ఉంటోన్నాయి. ఈ సంఖ్యను పెంచడానికి ట్రాయ్ ప్రత్యేకంగా ఓ కన్సల్టేషన్ పేపర్ ను జారీ చేసింది. ల్యాండ్ లైన్ వినియోగదారులపై ప్రతినెలా 200 రూపాయల మేర సబ్సిడీ ఇవ్వడానికి.. లేక అంతే మొత్తంలో టెలికమ్ కంపెనీల లైసెన్స్ ఫీజులను మాఫీ చేయడానికి అవకాశం ఉందా, అనే విషయంపై సమగ్ర నివేదిక అందజేయాలని ట్రాయ్ సూచించింది. ఈ విషయంలో టెలికమ్ కంపెనీల లైసెన్స్ ఫీజులను మాఫీ చేస్తే దాన్ని ఆయా కంపెనీలు దురుపయోగం చేస్తాయని ట్రాయ్ అభిప్రాయపడింది