Begin typing your search above and press return to search.
రైలులో పేలిన బాంబు జస్ట్ ప్రాక్టీస్ కోసమేనట
By: Tupaki Desk | 8 March 2017 5:27 PM GMTఅక్కడెక్కడో ఉన్న పిశాచాల్లాంటి ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు మన దేశానికి రాలేరన్న వాదన ఎంతమాత్రం నిజమని తేలటమే కాదు.. వారు దేశంలోని ఎంట్రీ ఇచ్చేయటమే కాదు.. దారుణమైన ప్లాన్ ఒకటి వేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు సానుభూతిపరులుగా అధికారులు అదుపులోకి తీసుకున్న వారు చెబుతున్న మాటలకు అధికారులకు దిమ్మ తిరిగేలా చేస్తోంది.
అదృష్టం బాగుండి.. నిన్న జరిగిన ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో బాంబు పేలుడు.. జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. ఏ స్థాయిలో పేలుతుందో టెస్ట్ చేయటం కోసమే తామీ పేలుడుకు పాల్పడినట్లుగా నిందితులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. తమ ప్లాన్ వర్క్ వుట్ అయి.. నష్ట తీవ్రతను అంచనా వేసి.. తర్వాతి రోజుల్లో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ పిశాచాల గుంపు సూఫీ ప్రార్థనాలయం మీదన దాడికి ప్లాన్ చేశారని.. భారీ జననష్టాన్ని కలిగించాలన్నదే వారి అసలైన ప్లాన్ గా తెలుస్తోంది. ఇందులోభాగంగా తొలుత ట్రైన్లో బాంబు పేల్చి.. నష్టం ఎంతగా ఉంటుందన్న అంచనాకు వచ్చిన తర్వాత.. తాము అనుకున్న దుర్మార్గ ప్లాన్ ను అమలు చేయాలని వారు భావించినట్లుగా తెలుస్తోంది.
ప్రాక్టీస్ కోసమే ట్రైన్లో బాంబు పేల్చారని.. త్వరలోనే బారాబంకీలోని సూఫీ ప్రార్థనాలయంపై భారీగా ప్లాన్ చేసిన విషయాన్ని అధికారులు గుర్తించారు. ట్రైన్లో బాంబు పేలుడు సంభవించిన వెంటనే రియాక్ట్ అయిన అధికారులు.. సీసీ కెమేరాలో లభించిన పుటేజ్ ఆధారంగా ముగ్గురిని మధ్యప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. అసలు కుట్రకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఒకవేళ ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఎంత ఘోరం జరిగిపోయేదో కదా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/