Begin typing your search above and press return to search.
ఉద్యోగం పేరుతో బోగీలు లెక్క పెట్టించారు.. తీరా అసలు విషయం తెలిసి..!
By: Tupaki Desk | 20 Dec 2022 10:30 AM GMTప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న డిమాండ్ ను పలువురు మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి లక్ష నుంచి పది లక్షలు ఆపై వసూలు చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. నకిలీ పత్రాలతో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు నిరుద్యోగులకు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. సంతోషంగా వాటిని పట్టుకుని జాబ్ లో జాయిన్ కావడానికి వెళితే అసలు స్టోరీ వేరే ఉందని తెలుసుకుని కంగు తింటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రైల్వే ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. శిక్షణ పేరుతో 26మంది యువకులను నెలరోజులపాటు వచ్చి పోయే రైలు బోగిలను లెక్కించారు. ఆ తర్వాత ఒక్కక్కొరి నుంచి 2 నుంచి 3లక్షలు వసూలు చేసి నకిలీ అపాయింట్ ఆర్డర్ కాపీలిచ్చారు. ఆ కాపీలను పట్టుకొని రైల్వే అధికారులకు వద్దకు వెళితే అవి నకిలీవని చెప్పడంతో మోసపోయామని గుర్తించి బాధితులు లబోదిబోమంటున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బు స్వామి ఆర్మీలో పని చేసి పదవీ విరమణ చేశాడు. కొన్ని నెలల కింద ఆయనకు ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్ లో శివరామన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలోనే తనకు ఎంపీలు.. మంత్రులు బాగా తెలుసని.. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించారు. అతని మాటలు నమ్మిన సుబ్బు స్వామి తనకు తెలిసిన ముగ్గురిని ఢిల్లీకి తీసుకొచ్చాడు.
ఈ విషయం చాలా మందికి తెలియడంతో మధురైకి చెంది మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బు స్వామిని కలిశారు. వీరిని కూడా ఆయన ఢిల్లీకి తీసుకొచ్చి శివ రామన్ కు పరిచయం చేశాడు. వీరందరికీ శివ రామన్ తాను రైల్వేలో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. రైల్వేలో టీసీ.. ట్రాఫిక్ అసిస్టెంట్.. క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 24 లక్షల వరకు వసూలు చేశారు.
వీరందరూ నుంచి శివ రామన్ ఏకంగా రూ.2.67 కోట్లు వసూలు చేశాడు. వైద్య పరీక్షలు.. ధృవపత్రాల తనిఖీ పేరిట కొన్ని రోజులు కాలం గడిపాడు. అనంతరం నకిలీ పత్రాలతో ట్రైనీ ఆర్డర్లు.. ఐడీ కార్డులను యువకులకు ఇచ్చాడు. ఈ 28 మందికి నెలరోజులపాటు శిక్షణ పేరుతో రైల్వే స్టేషన్ వచ్చిపోయే రైళ్లను.. వాటి బోగిలను లెక్కించాడు. రోజుకు 8 గంటల పాటు అలా నెలరోజులు వారంతా పని చేశారు. అనంతరం శిక్షణ పూర్తయిందని జాబ్ కు సంబంధించిన ఆర్డర్ కాపీలు వారి చేతిలో పెట్టాడు.
వీటిని తీసుకొని జాబ్ జాయిన్ అయ్యేందుకు రైల్వే అధికారుల వద్దకు వెళ్లగా ఆ ఆర్డర్ కాపీలు నకిలీవని తేల్చి చెప్పారు. దీంతో కంగుతిన్న బాధితులు సుబ్బు స్వామిని ఆశ్రయించారు. వీరంతా ఢిల్లీ పోలీసులను ఆశ్రయించి శివ రామన్ పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.