Begin typing your search above and press return to search.
ఏనుగుల మరణానికి కారణమైన రైలు ఇంజిన్ సీజ్ .. ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం!
By: Tupaki Desk | 21 Oct 2020 5:32 PM GMTరెండు ఏనుగుల చావుకు కారణమైన ఓ రైలు ఇంజిన్ను పోలీసులు సీజ్ చేశారు. భారతీయ రైల్వే పోలీస్ చరిత్రంలో ఇదో అరుదైన కేసుగా రికార్డులకెక్కెంది. మునుపెన్నడు ఇటువంటి కేసు జరగలేదని సీనియర్ రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే..
గత సెప్టెంబర్ 27న ఓ ఏనుగు, దాని పిల్ల ఓ గూడ్స్ రైలు కిందపడి చనిపోయాయి. ఈ ఘటన అసోమ్ రాష్ట్రంలోని గౌహతీలో జరిగింది. డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ దాస్ ఈ కేసును విచారిస్తున్నారు. సోమవారం ఆయన గౌహతిలోని బామునిమైదాన్ రైల్వే యార్డుకు వెళ్లారు. అక్కడికెళ్లి లోకోమోటివ్ (రైలు ఇంజిన్)ను సీజ్ చేశారు.
పట్టాలపై గూడ్స్ రైలు వెళ్తుండగా ఓ ఏనుగు.. దాని పిల్ల పట్టాలు దాటుతూ ఆ గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు అక్కడికక్కడే చనిపోగా.. పిల్ల ఏనుగును ఆ రైలు కిలోమీటర్ దూరం వరకూ ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో రైలు పైలట్, కోపైలట్ ఇద్దర్నీ రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.
చట్టం ఏం చెబుతున్నది..
వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏనుగు షెడ్యూల్ 1లో ఉన్న వన్యప్రాణి. రిజర్వ్ ఫారెస్టులో వెళ్లేటప్పుడు రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలి. అంతకుమించి వేగంగా వెళ్లకూడదనే రూల్ ఉంది. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఏనుగులను ఢీకొని వాటికి మరణానికి కారణమై ఆ రైలు వేగం గంటకు 60 కిలోమీటర్లు ఉందని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది. అందుకే వారిని సస్పెండ్ చేశామని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ దాస్ తెలిపారు. దీంతో పాటు రైలు ఇంజిన్ను సీజ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అసోంలో ఏటా రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోతున్నాయి. 2019లో 80 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. అలాగే 100 మంది మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయారు.