Begin typing your search above and press return to search.

ఇక రైల్లో.. వేకప్‌ కాల్స్‌..!

By:  Tupaki Desk   |   9 April 2015 9:07 AM GMT
ఇక రైల్లో.. వేకప్‌ కాల్స్‌..!
X
రైలు ప్రయాణానికి మించిన సుఖమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటి ఉండదు. సరదాగా కాలక్షేపం చేస్తూ ఒంటికి పెద్ద అలసట లేకుండా ప్రయాణించే వెసులుబాటు ట్రైన్లలోనే ఉంటుంది. అలాంటి రైలు ప్రయాణంలో ఉంటే ఒకే ఒక్క ఇబ్బంది.. రాత్రిళ్లు ప్రయాణాల్లో గమ్యానికి చేరుకునే విషయంలో టెన్షన్‌.

రాత్రిళ్లు స్టార్ట్‌ అయ్యే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్‌లో కచ్ఛితంగా దిగుతామా లేమా అన్న భయం ఉంటుంది? తాము కానీ నిద్రపోతే.. స్టేషన్‌ దాటిపోతామన్న ఆలోచన వారికి కొత్త టెన్షన్‌ తెప్పిస్తుంటుంది. దీనికి తోడు రైలు కానీ ఆలస్యంగా వెళుతుంటే.. తాము చేరుకోవాల్సిన స్టేషన్‌కు ఎప్పుడు చేరుకుంటామో తెలీక పడే టెన్షన్‌ అంతాఇంతా కాదు.

ఈ కారణంగానే.. రైల్లో ఎదురుగా ఉండేవారితో.. పక్కగా ఉండే వారితోనో ఫలానా స్టేషన్‌ దగ్గరకు వచ్చిన సమయంలో కాస్తంత చెప్పరా? అన్న రిక్వెస్ట్‌లు చేసుకోవటం కనిపిస్తుంటాయి. తాజాగా రైల్వేలు చేసిన సరికొత్త ఆలోచనతో ఇలాంటి ఇబ్బందులకు తెర పడననున్నాయి.

తాజాగా తీసుకొచ్చిన సౌకర్యంతో 139 నెంబర్‌కి ఫోన్‌ చేసి.. తమ టిక్కెట్టు నెంబరు.. తాము దిగాల్సిన స్టేషన్‌.. ఫోన్‌ నెంబరు వివరాలు నోట్‌చేస్తే.. సదరు స్టేషన్‌ రైలు బండి చేరుకోవటానికి అరగంట ముందు సదరు ఫోన్‌కు అలెర్ట్‌ కాల్‌ వస్తుంది. మీరు దిగాల్సిన స్టేషన్‌ కాసేపట్లో వస్తుంది.. రెఢీగా ఉండండి అంటూ వేకప్‌ కాల్‌ ఇస్తుంది. సో.. ఇకపై రైళ్లలో ప్రయాణించే వారికి ఉన్న ఒక్క సమస్య తీరిపోయినట్లే.