Begin typing your search above and press return to search.

మతపరమైన దాడులకు శిక్షణా?

By:  Tupaki Desk   |   5 July 2022 3:29 AM GMT
మతపరమైన దాడులకు శిక్షణా?
X
మతాల మధ్య వైషమ్యాలు పెంచి పరస్పరం దాడులు చేసుకునేలా లేదా ఎదుటిమతంపై దాడులు చేసేలా అవసరమైన శిక్షణ ఇస్తున్న వారిని పోలీసులు అరెస్టుచేశారు. నిజామాబాద్ కేంద్రంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) పేరుతో ఒక సంస్ధను ఏర్పాటుచేసి అందులోకి యువతను చేర్చుకుని హిందుమతానికి వ్యతిరేకంగా శిక్షణ ఇస్తున్న కేంద్రం నిర్వాహకుడు, కరాటేమాస్టర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు.

సిమీ అనే ఉగ్రవాద సంస్ధలో శిక్షణ తీసుకుని, ఆ సంస్ధలోనే చాలాకాలం పనిచేసిన ఖాదర్ బయటకు వచ్చేసి కొత్తగా పీఎఫ్ఐ అనే సంస్ధను ఏర్పాటుచేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్రంపై అనుమానం రావటంతో నిఘాపెట్టారు.

తమ అనుమానం నిర్ధారణకావటంతో తెల్లవారుజామున పోలీసులు దాడిచేశారు. కరాటే శిక్షణ ముసుగులో యువకులను పెద్దఎత్తున చేర్చుకుంటు హిందుమతానికి వ్యతిరేకంగా భావజాలాన్ని నూరిపోస్తున్నారు.

ఇదే సమయంలో హిందుమతానికి వ్యతిరేకంగా ఎలా పనిచేయాలి, ఎవరెవరిపై దాడులు చేయాలనే విషయాలను ఖాదర్ యవకులకు ప్రతిరోజు శిక్షణిస్తున్నట్లు నిర్ధారణైంది. తెలుగురాష్ట్రాల్లోని భైంసా, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 300 మంది యువకులకు ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చాడు. హిందుమతానికి వ్యతిరేకంగా శిక్షణ తీసుకున్న ఈ యువకులంతా ఎక్కడెక్కడున్నారు, ఏమి చేస్తున్నారు అనే విషయాలపై పోలీసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పీఎఫ్ఐ ద్వారా మతపరమైన ట్రైనింగ్ ఇవ్వటమే తన ధ్యేయమని ఖాదర్ పోలీసుల విచారణలో అంగీకరించారట. తన దగ్గర శిక్షణ తీసుకున్న యువకులు ఇపుడు ఎక్కడెక్కడున్నారో తనకు తెలియదని చెప్పాడట.

శిక్షణా తరగతులు నిర్వహించటానికి, యువతను ఆకర్షించటానికి అవసరమైన నిధులను తనకు బయటనుండి వస్తున్నట్లు అంగీకరించాడు. ఎక్కడెక్కడి నుండి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఖాదర్ చెప్పలేదు. అందుకనే ఆయన బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికి బయటపడింది నిజామాబాద్ కేంద్రంలోని ట్రైనింగ్ సెంటర్ ఒకటే. ఇలాంటి సెంటర్లు ఇంకా ఎన్ని ఉన్నాయో.